
మన టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లోనూ తొలుత అసిస్టెంట్లుగా కెరీర్ ను మొదలుపెట్టి హీరోలుగా మారినవారు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో కోలీవుడ్ మరియు టాలీవుడ్ లో సమానమైన క్రేజ్ కలిగిన తమిళ కథానాయకుడు కార్తీ కూడా ఒకడట. 2003లో మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలెట్టాడట కార్తీ.. ఆ తర్వాత "యుగానికి ఒక్కడు" సినిమాతో హీరోగా మారి అనంతరం అన్నకు తగ్గ తమ్ముడిగా పేరు తెచ్చుకొన్నాడు.
అయితే.. 2003లో మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా కెరీర్ మొదలుపెట్టిన కార్తీ.. నేడు ఆయన దర్శకత్వంలో హీరోగా నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని కార్తీ అన్నయ్య సూర్య పేర్కొన్నాడు. నిన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు సూర్య. ఎవరి దగ్గర పని నేచుకొన్నాడే ఆయన దర్శకత్వంలో హీరోగా నటించడం అంటే ఒక హీరోగా కార్తీ ఎదుగుదలకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది!




.jpg)

