'కేజీఎఫ్'ను దాటేసిన 'కాంతార చాప్టర్ 1'.. నాలుగో రోజు దిమ్మతిరిగే కలెక్షన్స్!
on Oct 6, 2025

భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ని రాబట్టడం సహజం. ఆ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వస్తుంటాయి. అలాంటిది ఓ పాన్ ఇండియా మూవీ.. మొదటి రోజు కంటే నాలుగో ఎక్కువ కలెక్షన్స్ రాబడితే?. తాజాగా 'కాంతార చాప్టర్ 1' అలాంటి ఫీట్ నే సాధించింది. (Kantara Chapter 1)
'కాంతార'కి ప్రీక్వెల్ గా రూపొందిన 'కాంతార చాప్టర్ 1' భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షోకే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ.. భారీ వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్ల గ్రాస్ రాబట్టిన 'కాంతార చాప్టర్ 1'.. రెండో రోజు రూ.61 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. మూడో రోజు అయితే మొదటి రోజు స్థాయిలో రూ.85 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఇక నాలుగు రోజయితే.. ఏకంగా ఫస్ట్ డే కలెక్షన్స్ ని మించేలా రూ.90 కోట్లకు పైగా గ్రాస్ తో సంచలనం సృష్టించింది. దీంతో ఫస్ట్ వీకెండ్ లోనే ఈ మూవీ రూ.325 కోట్లకు పైగా సాధించింది.
2022లో వచ్చిన 'కాంతార' ఫుల్ రన్ లో రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి.. కన్నడ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాల లిస్టులో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1' కేవలం నాలుగు రోజుల్లోనే రూ.325 కోట్ల గ్రాస్ రాబట్టి, రూ.250 కోట్ల గ్రాస్ మూడో స్థానంలో ఉన్న 'కేజీఎఫ్'ను దాటేసింది. ప్రస్తుత జోరు చూస్తుంటే మొదటి వారంలోనే 'కాంతార' లైఫ్ టైం కలెక్షన్స్ ని కూడా దాటేసి.. టాప్-2 లో నిలిచేలా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



