మంచు విష్ణుకి బాలీవుడ్ లో వరుస ఆఫర్లు.. కాకపోతే ఆ విషయంలో జాగ్రత్త అవసరం
on Jul 2, 2025

'మంచు విష్ణు'(Manchu Vishnu)రీసెంట్ గా జూన్ 27 న 'కన్నప్ప'(Kannappa)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీకాళహస్తీశ్వరుడి((Sri Kalahastiswara)పరమ భక్తుడైన 'కన్నప్ప' క్యారక్టర్ లో విష్ణు జీవించాడనే కితాబుని అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అందుకుంటున్నాడు. కలెక్షన్స్ పరంగా కూడా కన్నప్పతో తన కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ ని అందుకోబోతున్నట్టుగా రిపోర్ట్ లు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రీసెంట్ గా విష్ణు ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు నేను త్వరలోనే బాలీవుడ్(Bollywood)లో నటించే అవకాశం ఉంది. నిజానికి చాలా ఏళ్ళ క్రితమే కొంత మంది బాలీవుడ్ దర్శక నిర్మాతలు నన్ను సంప్రదించారు. కానీ నా క్యారెక్టర్లు నచ్చకపోవడంతో నో చెప్పాను. ఎందుకంటే అగ్ర హీరోగా అభిమానులు,ప్రేక్షకుల దృష్టిలో నాకంటు, ఒక గౌరవం ఉండాలని కోరుకుంటున్నాను. దేశంలో ఉన్న అతి పెద్ద సూపర్ స్టార్స్ లో అజిత్ కుమార్ ఒకరు. షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన 'అశోకా' అనే సినిమాలో చాలా చిన్న క్యారక్టర్ చేసారు. ఒకసారి నేను ఆయన్ని కలిసినప్పుడు మీరు చేసిన పాత్ర నాకు నచ్చలేదండి, నిరాశకి లోనయ్యానని చెప్పాను. అందుకే బాలీవుడ్ లో మంచి క్యారెక్టర్స్ ద్వారా పరిచయం కావాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.
విష్ణునే స్వయంగా హిందీలో నటించబోతున్నానని చెప్పడంతో ఎలాంటి సినిమాలో నటిస్తాడనే ఆసక్తి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను ఉంది. ప్రస్తుతానికి అయితే కన్నప్ప సక్సెస్ ని విష్ణుతో పాటు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మోహన్ బాబు,(Mohan Babu)ప్రభాస్(Prabhas),అక్షయ్ కుమార్(Akshaykumar)శరత్ కుమార్(sharathkumar)మోహన్ లాల్(Mohanlal)కాజల్, ప్రీతీ ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh)దర్శకత్వం వహించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



