Home

»

Latest News

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ లో క‌ళ్యాణ్ రామ్!!

May 28, 2019 6:23PM

 

ఇటీవ‌ల `118` సినిమాతో మంచి స‌క్సెస్ అందుకున్నాడు క‌ళ్యాణ్ రామ్. హీరోగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు త‌న బేన‌ర్ లో కూడా సినిమాలు నిర్మిస్తూ వ‌స్తున్నాడు. ప్ర‌జంట్ సోషియే ఫాంట‌సీ చిత్రం `తుగ్ల‌క్` సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గానే మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట క‌ళ్యాణ్ రామ్. అవును `శ‌త‌మానంభ‌వ‌తి` సినిమాతో క్రిటిక్స్ నుంచి ప్రేక్ష‌కుల‌ను నుంచి  ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న ఇటీవ‌ల క‌ళ్యాణ్ రామ్ కి ఒక స్టోరి లైన్ చెప్పాడ‌ట‌. కుటుంబ బంధాలు, విలువ‌ల‌తో కూడిన క‌థ కావ‌డంతో క‌థ న‌చ్చిన వెంట‌నే స‌తీష్ వేగేశ్న‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం అందుతోంది. త్వ‌ర‌లోనే దీనిపై ఒక క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలున్న‌ట్లు  తెలుస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com