
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)ఫ్యాన్స్ కి అతి పెద్ద గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇండియన్ మోస్ట్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ కల్కి 2(Kalki Part 2)రిలీజ్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో ఒక్కడే ఒక్కడు మొనగాడు అనే రీతిలో చక్కర్లు కొడుతుంది. మరి అదే కనుక నిజమైతే ఫ్యాన్స్, మూవీ లవర్స్, ఆడియెన్స్, సెల్యులాయిడ్ కి అతి పెద్ద పండుగ ముందే వచ్చినట్లవుతుందని చెప్పవచ్చు . ఆ డీటెయిల్స్ చూద్దాం
డిసెంబర్ 2027లో కల్కి పార్ట్ 2 ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి వైజయంతీ మూవీస్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి కల్కి ఉన్న ప్రోటాన్షియల్ దృష్ట్యా చాలా మంది 2028 లో కల్కి రిలీజ్ అవుతుందని భావిస్తు వస్తున్నారు. కానీ 2027 డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. మరి అదే నిజమైతే కల్కి ఫ్యాన్స్ కి పండుగ కొంచం ముందే వచ్చినట్లవుతుంది. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. రీసెంట్‌గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మధ్య కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించారు. ప్రభాస్ ప్రస్తుతం తన ఇతర ప్రాజెక్టులైన 'ఫౌజీ' 'స్పిరిట్' తో బిజీగా ఉండటం వల్ల,ఈ ఏడాది చివర్లో లేదా ఆగష్టు లేదా సెప్టెంబర్ లో కల్కి సెట్స్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది.
Also Read: Chiranjeevi: మెహర్ రమేష్ కూతురు ఎంగేజ్ మెంట్ వీడియో వైరల్.. గత నెల 26 న చిరు ఏం చేసాడో తెలుసా!
పార్ట్-1 కంటే రెట్టింపు స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ,యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేలా దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin)ప్లాన్ చేస్తున్నాడు. మరి కర్ణ, అశ్వత్థామ కలిసి యాస్కిన్ సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.





