Home

»

Latest News

kajal Aggarwal: ఇక దానికి గుడ్ బై.. హీరోలకి పోటీ ఇస్తుందా!

Jun 16, 2026 11:10AM

 

హీరోయిన్స్ క్యారక్టర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పాటు తన కోసమే క్యారెక్టర్స్ రాసే స్థాయికి ఎదిగిన నటి కాజల్ అగర్వాల్(kajal Aggarwal).గ్లామర్, పెర్ ఫార్మెన్స్ ని కలగలిపి దాదాపుగా అందరి హీరోలతో జోడి కట్టి అగ్ర హీరోయిన్ అనే టాగ్ లైన్ సొంతం చేసుకుంది. రెండు దశాబ్దాలుగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఒక వెలుగు కూడా వెలిగింది. పెళ్లితో పాటు తల్లైన తర్వాత తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్‌లో  రూట్ మార్చి పూర్తి యాక్షన్ మోడ్‌లోకి మారిపోయింది. కమర్షియల్ హంగులు, గ్లామర్ హద్దులను పక్కనబెట్టి, నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన, లేడీ ఓరియంటెడ్ కథలపైనే పూర్తి ప్లాన్ లో ఉంది.

నిజానికి పెళ్లి, ప్రెగ్నెన్సీ విరామం తర్వాత వెండితెరపై రీఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు ఆమె ముందు ఎన్నో సవాళ్లు నిలిచాయి. దాదాపు ఆరేళ్ల పాటు సరైన కమర్షియల్ సక్సెస్ లేకపోవడం, ఫామ్ తగ్గడంతో ఇండస్ట్రీలో అవకాశాలు కష్టమేనని అందరూ భావించారు. సాధారణంగా సీనియర్ హీరోయిన్లకి  సెకండ్ ఇన్నింగ్స్‌లో కేవలం సపోర్టింగ్ క్యారెక్టర్లు లేదా తల్లి రోల్స్  దక్కుతుంటాయి. కానీ, ఆ మూస పద్ధతిని బ్రేక్ చేయాలని కాజల్ గట్టిగా నిశ్చయించుకుంది. ఈ క్రమంలోనే గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ తో  'భగవంత్ కేసరి'  రీఎంట్రీ ఇచ్చి  భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టించి, ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ పలికింది.

ఈ భారీ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో కాజల్ తన తదుపరి ప్రాజెక్టులని  మరింత వైవిధ్యంగా ఎంచుకుంది. లేడీ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన 'సత్యభామ' మూవీ  కోసం కూడా ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్ష‌ణ తీసుకుంది. ఖాకీ చొక్కా తొడిగి పోలీస్ ఆఫీసర్‌గా ఆమె చేసిన యాక్షన్ స్టంట్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

ప్రస్తుతం ఈ చందమామ ట్రెండ్‌కి తగ్గట్టుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సత్తా చాటేందుకు సిద్దమయ్యి  ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) 2026 ఏడాదికి గానూ ప్రకటించిన క్రేజీ తెలుగు ఒరిజినల్స్ స్లేట్‌లో లీడ్ రోల్ పోషిస్తున్న 'విశాఖ' (Vishaka) సిరీస్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. స్టార్ హీరోలతో కమర్షియల్ డ్యూయెట్లు పాడే రోజులకి  గుడ్ బై చెప్పేసి, అనుష్క శెట్టి, సమంత తరహాలో ఒంటిచేత్తో సినిమాని  నడిపించే పంథాను ఎంచుకుంది. ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అగ్ర నాయికలకు గట్టి పోటీ ఇస్తూ, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ కాజల్ అగర్వాల్ దూసుకుపోతున్న తీరు టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com