Home

»

Latest News

kalki 2: 'కల్కి 2'లోకి అలియా భట్ ఎంట్రీ.. అప్పుడే షూటింగ్ కూడా పూర్తి చేసేసిందా?

Jun 16, 2026 11:02AM

పాన్ ఇండియా స్టార్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టింది. మొదటి భాగం ముగింపులోనే రెండో భాగంపై ఓ రేంజ్ అంచనాలను పెంచేసిన నాగ్‌ అశ్విన్, ఇప్పుడు ‘కల్కి 2’ (Kalki 2) స్క్రిప్ట్‌ను మరింత పకడ్బందీగా సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ సినీ ప్రియుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ విజువల్ ఎపిక్‌లోకి బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇండియన్ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అలియా, ‘కల్కి 2’లో ఒక అత్యంత కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే వెలువడనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లోకి అలియా భట్ చేరడంపై ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. అంతటితో ఆగకుండా, ఈ క్రేజీ సీక్వెల్ కోసం అలియా భట్ ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల షూటింగ్‌లో కూడా పాల్గొందని, ఆ సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల నుంచి బలమైన లీకులు అందుతున్నాయి. ఈ అప్‌డేట్‌తో సినిమా రేంజ్ ఒక్కసారిగా డబుల్ అయిపోయిందని చెప్పాలి.

మరోవైపు, ఈ సినిమాలో టాలెంటెడ్ బ్యూటీ, నేచురల్ యాక్ట్రెస్ సాయి పల్లవి పాత్రకు సంబంధించిన అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మొదటి భాగంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ‘సుమతి’ (SUM 80) పాత్రలో దీపికా పదుకొణె కనిపించిన సంగతి తెలిసిందే. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సీక్వెల్ నుంచి దీపికాను తప్పించారు. సీక్వెల్‌లో ఈ ‘SUM 80’ క్యారెక్టర్‌ను సాయి పల్లవి పోషించబోతోందని సమాచారం. ఇప్పటికే సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్‌లోకి సైన్ చేసిందని, ఆమె క్యారెక్టర్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని టాక్ వినిపిస్తోంది. 

ఒకవైపు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు, మరోవైపు అలియా భట్, సాయి పల్లవి లాంటి స్టార్ హీరోయిన్లు తోడవడంతో ‘కల్కి 2’ ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవేటెడ్ సీక్వెల్‌గా అవతరించింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com