Home

»

Latest News

కబాలి పోస్ట్ పోన్ అవ్వనుందా ?

Jun 29, 2016 12:58PM

రజనీకాంత్ లేటెస్ట్ సెన్సేషన్ "కబాలి" విడుదల తేదీ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇటీవల హైద్రాబాద్ లో తెలుగు వెర్షన్ "కబాలి" ఆడియో విడుదల సందర్భంగా ఇక్కడకు వచ్చిన డైరెక్టర్ రంజిత్ కూడా విడుదల తేదీ గురించి ఏ విషయమూ ప్రకటించకపోవడం, ఇప్పటివరకూ ప్రమోషన్స్ ఏమీ స్టార్ట్ అవ్వకపోవడంతో.. "కబాలి" విడుదల తేదీలో మార్పులు చోటు చేసుకొన్నాయి అనే వార్త ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. నిజానికి "కబాలి"ని తొలుత జూలై 1న విడుదల చేద్దామనుకొన్నారు, కానీ తర్వాత రంజాన్ కలిసొస్తుంది కదా అని జూలై 15కి మార్చారు. అయితే.. ఆ తేదీన కూడా "కబాలి" విడుదలవ్వడం కష్టమని తెలుస్తోంది. కారణం సరిగా తెలియదుగానీ.. "కబాలి" చిత్రాన్ని జూలై 20న విడుదల చేద్దామని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ.. "కబాలి" గనుక పోస్ట్ పోన్ అయితే చాలా సినిమాల విడుదల తేదీలు అయోమయంలోపడడం ఖాయం!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com