Home

»

Latest News

టెండుల్కర్ బాటలో అక్కినేని అఖిల్...!

Jun 29, 2016 12:26PM



అలా మన పూర్వీకులు ఎందుకు ఫిక్స్ చేశారో తెలియదు కానీ.. పెళ్ళి చేసేప్పుడు అబ్బాయి కంటే అమ్మాయి కనీసం రెండేళ్ళైనా చిన్నదై ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటారు. ఎవరో తప్పితే ఆ పద్ధతిని ఫాలో అవ్వకుండా పెళ్లి చేసుకొనేవారుండరు. ఈమధ్య కాలంలో ఈ ఆనవాయితీని బ్రేక్ చేస్తున్నారు. అప్పట్లో సచిన్ టెండుల్కర్ తనకంటే వయసులో అయిదేళ్లు పెద్దదైన అంజలిని ప్రేమించి పెళ్ళాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు అదే బాటలో అక్కినేణి అఖిల్ కూడా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్నుంచీ అఖిల్ ప్రేమకథ, ప్రేమించిన అమ్మాయి గురించి చాలా చదివారు. ఇప్పుడు వారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోండి.

అఖిల్ కు శ్రేయ భూపాల్ తో గత ఎనిమిదేళ్లుగా మంచి అనుబంధం ఉంది. శ్రేయ తల్లి శాలిని అక్కినేని ఫ్యామిలికీ మంచి సన్నిహితురాలు. ఆ సాన్నిహిత్యమే శ్రేయను అఖిల్ కి దగ్గర చేసింది. ఆ సాన్నిహిత్యం ఆ తరువాత ప్రేమగా రూపాంతరం చెందింది. కట్ చేస్తే.. అఖిల్ కంటే శ్రేయ వయసులో ఓ ఏడాది పెద్దదని తెలిసింది. అప్పటికే పీకల్లోతు ప్రేమలో మునుగిపోయిన అఖిల్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నాగార్జున ఈ విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అఖిల్ నిర్భయంగా తన ప్రేమ విషయాన్ని ప్రకటించేశాడు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com