Home

»

Latest News

కీరవాణి ఇంట పెళ్లి సందడి.. ‘బలగం’ హీరోయిన్‌తో కాలభైరవ నిశ్చితార్థం!

Nov 7, 2026 3:40PM

‘ఆర్ఆర్ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు, గాయకుడు కాలభైరవ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడైన కాలభైరవ.. నటి కావ్య కల్యాణ్‌రామ్‌ను వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి పెళ్లి వేడుకలకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

కాలభైరవ, కావ్య తమ ప్రేమ విషయాన్ని ఆగస్టు 31న సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఇద్దరూ ప్రత్యేక పోస్టులు పెట్టారు. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు అప్పట్లో వెల్లడించారు. అదే సమయంలో నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. 

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ వేడుకను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి కూడా ఈ వేడుకకు హాజరై కాలభైరవ, కావ్యలను ఆశీర్వదించారు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న కాబోయే వధూవరుల ఫొటోలు బయటకు రావడంతో అభిమానులు వాటిని ఆసక్తిగా చూస్తున్నారు. 

ఇక కాలభైరవ విషయానికి వస్తే.. తండ్రి కీరవాణి సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి ఆయన అందించిన గాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ‘మత్తు వదలరా’, ‘కలర్ ఫోటో’, ‘కార్తికేయ 2’ వంటి సినిమాలకు సంగీతం అందించి తన ప్రతిభను చాటుకున్నారు. 

ఇది కూడా చదవండి: ‘దాదా’ ఫస్ట్ సాంగ్ డేట్ ఫిక్స్: ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్ రెడీ.!

మరోవైపు కావ్య కల్యాణ్‌రామ్ బాలనటిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హీరోయిన్‌గా మారి ‘మసూద’, ‘బలగం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా ‘బలగం’ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు కాలభైరవతో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుండటంతో ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇరు కుటుంబాల అంగీకారంతో కాలభైరవ, కావ్యల వివాహాన్ని డిసెంబర్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అయితే పెళ్లి తేదీ, వేదికకు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. మొత్తానికి కీరవాణి ఇంట్లో మొదలైన ఈ పెళ్లి సందడి సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

మీకు నచ్చవచ్చు: ‘రామాయణ’పై సల్మాన్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు: ఆ వ్యాఖ్యలపై చర్చ జరగాల్సిందే

 

 

 

[Kaala Bhairava Engagement, Kaala Bhairava Wedding, MM Keeravani Son, Kavya Kalyanram, Kavya Kalyanram Wedding, Kaala Bhairava Kavya Engagement, Balagam Actress Kavya, SS Rajamouli, Tollywood Celebrity Weddings, Kaala Bhairava Marriage, December Celebrity Weddings]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com