
కమెడియన్ గా ధూసుకుపోతున్నాడు సత్య. ప్రస్తుతం ఆదర్శ కుటుంబంతో మరో సారి తనదైన కామెడీ పండించి అభిమానులు, ప్రేక్షకులని నవ్వుల జడివానలో ముంచెత్తుతున్నాడు. టైమింగ్, బాడీ లాంగ్వేజ్ సత్య ప్రధాన బలం. ఇంకో సునీల్ అనే మాటలు సైతం ప్రేక్షకుల నుంచి వినిపిస్తూ ఉంటాయి.
ట్రేడ్ నివేదికల ప్రకారం, సత్య ఒక్కో సినిమాకి రోజుకి 3 లక్షల నుండి 4 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో డిమాండ్‌కి తగినట్టుగానే నిర్మాతలు కూడా పారితోషికం చెల్లించేందుకు ముందుకొస్తున్నారు.
రోజురోజుకూ పెరుగుతున్న ఆయన క్రేజ్ చూస్తుంటే టాలీవుడ్లో రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
.webp)
కామెడీతో పాటు విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న సత్య, తన కష్టంతో నేడు టాలీవుడ్‌లోని టాప్ కమెడియన్ల సరసన నిలిచారు. ఈ భారీ రెమ్యునరేషన్ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి: రామాయణపై సల్మాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు: ఆ వ్యాఖ్యలపై చర్చ జరగాల్సిందే!
సత్య చేతిలో ప్రస్తుతం ఏకంగా డజనుకు పైగా భారీ ప్రాజెక్టులు క్యూ కట్టాయి. వరుస సినిమాలతో డేట్స్ అడ్జస్ట్ చేయలేనంత బిజీగా ఉన్న ఈ నటుడు, టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడం ఖాయం.

ఇండస్ట్రీకి ఎన్నో ఏళ్ళ క్రితమే వచ్చినా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఈ స్టార్ కమెడియన్ గా మారాడు. స్వామి రారా మూవీతో మంచి గుర్తింపు వచ్చింది.
మీకు నచ్చవచ్చు: సౌందర్య చనిపోయాక ఆ ఇంట్లో జరిగిన సంఘటన ఇదే!
మీకు నచ్చవచ్చు: రెమ్యురేషన్ తక్కువయిందని సీతాదేవి రోల్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్!
[Comedian Satya Remuneration, Comedian Satya, Satya remuneration, Tollywood comedians, Actor Satya movies, Mathu Vadalara Satya,Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]




