
ఏమైనా ప్రస్తుతం ఓటిటి సినీ ప్రేమికులంత అదృష్టవంతులు మరొకరు లేరని చెప్పవచ్చు. మరి ఒకటా రెండా ఏకంగా ఇరవై సినిమాలు ఓటిటి ప్రియులని సందడి చెయ్యడానికి ముస్తాబయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా వంటి టాప్ ఓటీటీ వేదికగా ప్రాంతీయ భాషా చిత్రాల నుంచి ఇంటర్నేషనల్ క్రైమ్ థ్రిల్లర్స్ వరకి ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టుగా ఈ వారాంతం వినోదాల జాతర సాగనుంది. మరి జూన్ 5 స్పెషల్ మూవీస్ చూద్దాం.
'ఆహా తెలుగు' వేదికగా క్రేజీ సైకలాజికల్ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ 'అగ్లీ స్టోరీ' స్ట్రీమింగ్ అవుతోంది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్‌లో మంచి క్యూరియాసిటీని పెంచుతోంది. దీనితో పాటు జియోహాట్‌స్టార్‌లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధురంధర్ 2: ది రివేంజ్' తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదలైంది. థియేటర్లలో సెన్సార్ కట్స్ ఎదుర్కొన్న ఈ చిత్రం, ఓటీటీలో ఎలాంటి కట్స్ లేని ఒరిజినల్ వెర్షన్‌తో హైస్టేక్స్ రివేంజ్ డ్రామాగా స్ట్రీమింకి రావడం విశేషం.
ఇక మాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ కాంబినేషన్‌లో రూపొందిన హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ 'పేట్రియాట్' జీ5 వేదికగా తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, సైబర్ ఎటాక్స్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఫహద్ ఫాజిల్, నయనతార ముఖ్య పాత్రల్లో మెరవడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. జీ5లోనే కరిష్మా కపూర్ కీ రోల్ పోషించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'బ్రౌన్', కన్నడ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'కేడీ ది డెవిల్' తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ కూడా విడుదలై థ్రిల్లర్ లవర్స్‌కి మంచి ఛాయిస్‌గా మారాయి.
Also read: vaishnav tej: 100 కథలు రిజెక్ట్ చేసి కొత్త సినిమాని లైన్ లో పెట్టిన వైష్ణవ్ తేజ్
మరోవైపు నెట్‌ఫ్లిక్స్ లవర్స్ కోసం రొమాంటిక్ కామెడీ నుంచి ఇంటర్నేషనల్ మిస్టరీల వరకు ఒక పెద్ద లిస్టే సిద్ధమైంది. తమిళ హిట్ రొమాంటిక్ కామెడీ '29' తెలుగు డబ్బింగ్‌తో పాటు హాలీవుడ్ చిత్రం 'ఆఫీస్ రొమాన్స్', స్పోర్ట్స్ కామెడీ 'మెక్సికో 86', స్పానిష్ క్రైమ్ మిస్టరీ 'ది మార్క్‌డ్ ఉమెన్', కొరియన్ థ్రిల్లర్ సిరీస్ 'టీచ్ యూ ఏ లెసన్' వంటివి గ్లోబల్ కంటెంట్‌ను ఇష్టపడే వారిని అలరిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మిడిల్ క్లాస్ ఆశలు, మార్కెటింగ్ స్కామ్స్ చుట్టూ తిరిగే గ్రిప్పింగ్ డ్రామా సిరీస్ 'ది పిరమిడ్ స్కీమ్' మరియు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'డెకాయిట్: ఏక్ ప్రేమ్ కథ' హిందీ వెర్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి మిస్ అవ్వకుండా సినీ మాజాని పొందండి.






