
మెగామేనల్లుడు వైష్ణవ్ తేజ్ తన తొలి చిత్రం 'ఉప్పెన'తో బ్లాక్‌బస్టర్ హిట్ ని అందుకోవడమే కాకుండా వంద కోట్ల క్లబ్‌లో చేరి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు. కానీ ఆ తర్వాత చేసిన కొండపొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ' వరుస డిజాస్టర్స్ గా నిలవడంతో ఈ సారి హిట్ ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.
దీంతో గత మూడేళ్లుగా సరైన కథ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఈ క్రమంలో 100 కి పైగా స్క్రిప్ట్‌లను విన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త దర్శకుడు మహేష్ చెప్పిన ఒక వైవిధ్యమైన లైన్ వైష్ణవ్ తేజ్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ కథలో ఉన్న కొత్తదనం, క్యారెక్టరైజేషన్ తన కమ్‌బ్యాక్‌కి పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందని భావించి వెంటనే ఓకే చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి.
Also read: Vijay: జన నాయగన్ కి బిగ్ షాక్.. థియేట్రికల్ డీల్స్ మొత్తం క్యాన్సిల్
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్' (AK Entertainments) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. వైష్ణవ్ తేజ్ కెరీర్‌లోనే ఇది అత్యధిక బడ్జెట్‌తో రూపొందే చిత్రంగా నిలవబోతోంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.




