యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. భుజం గాయం కారణంగా కొంతకాలంగా షూటింగ్స్‌కు దూరంగా ఉన్న తారక్.. ఇప్పుడు పూర్తిగా కోలుకుని తిరిగి సెట్స్‌పైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ కూడా జరిగింది. ప్రస్తుతం ఫిజియోథెరపీ తీసుకుంటూ రికవరీ అవుతున్న ఎన్టీఆర్.. అక్టోబర్‌లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ షూటింగ్‌లో తిరిగి పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
ఎన్టీఆర్ గాయంతో షూటింగ్‌కు బ్రేక్ వచ్చినప్పటికీ దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం సినిమా పనులను ఆపలేదు. తారక్ అవసరం లేని సన్నివేశాలతో పాటు ఇతర నటీనటులకు సంబంధించిన భాగాలను చిత్రీకరిస్తూ షూటింగ్‌ను కొనసాగించారు. దీంతో సినిమా నిర్మాణం పూర్తిగా నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రీఎంట్రీ కోసం చిత్రబృందం కీలకమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ‘డ్రాగన్’ విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, డార్క్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ఈ పాత్రపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఎన్టీఆర్ సెట్స్‌పైకి వచ్చిన తర్వాత మిగిలిన కీలక సన్నివేశాలను వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘డ్రాగన్’ను 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకుని తారక్ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వస్తుండటంతో ఈ సినిమా షూటింగ్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
[Jr NTR, NTR Dragon, NTR Dragon Movie, Jr NTR Comeback, NTR Injury, NTR Shoulder Injury, NTR Dragon Shooting, Prashanth Neel Dragon, NTR Upcoming Movie, Dragon Movie Update, Rukmini Vasanth, Anil Kapoor, Tollywood News]




