Home

»

Latest News

‘డ్రాగన్’ లేటెస్ట్ అప్‌డేట్‌.. శ్రీ‌లంక‌లో ఎన్టీఆర్ హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎపిసోడ్‌!

Jun 7, 2026 10:36AM

గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త షూటింగ్ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

ఈ భారీ యాక్షన్ డ్రామా తదుపరి కీలక షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ విదేశాలకు ప్రయాణం కానుంది. తాజా సమాచారం ప్రకారం, వచ్చే నెలలో ‘డ్రాగన్’ టీమ్ శ్రీలంకలో ల్యాండ్ అవ్వబోతోంది. అక్కడ ప్లాన్ చేసిన సుదీర్ఘ షెడ్యూల్‌లో తారక్‌పై కొన్ని అత్యంత ప్రతిష్టాత్మకమైన, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రీకరించనున్నారు. ఈ లంక షెడ్యూల్‌తో సినిమాకు సంబంధించిన ఒక మేజర్ టాకీ మరియు యాక్షన్ పార్ట్ పూర్తవుతుందని ఇండస్ట్రీ టాక్.

ఇటీవలే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘డ్రాగన్ గ్లిమ్స్’ సోషల్ మీడియాను షేక్ చేసింది. బ్రిటీష్ కాలం నాటి అంతర్జాతీయ ఓపియం డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే పవర్‌ఫుల్ డార్క్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు తారక్‌ను చూడని ఒక విలక్షణమైన, క్రూరమైన గెటప్‌లో ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ ఎవర్గ్రీన్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజూ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రవి బస్రూర్ ఈ చిత్రానికి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతాన్ని అందిస్తున్నారు.  

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లంక షెడ్యూల్ గురించిన వార్తలు ట్రెండ్ అవుతుండటంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ యాక్షన్ థ్రిల్లర్, వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com