Home

»

Latest News

Balan: మంజుమ్మేల్ బాయ్స్ డైరెక్టర్ కొత్త మూవీ ట్రైలర్ రచ్చ.. తెలుగు డబ్బింగ్ ఇంత ఘోరమా!

Jun 6, 2026 7:17PM

 

'మంజుమ్మేల్ బాయ్స్' తో  దర్శకుడు చిదంబరం(Chidambaram)సృష్టించిన విషయం తెలిసిందే. కంటెంట్ కి ఉన్న దమ్ము ఏంటో చూపించడమే కాకుండా సినిమానే నమ్ముకున్న మేకర్స్ కి సరికొత్త ధైర్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు  జూన్ 19 న  సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్  'బాలన్: ది బాయ్'తో వస్తున్నాడు. ఆవేశం సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న జితు మాధవన్ కథ అందించడం, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 మార్చే డ్యు ఫిల్మ్ విభాగంలో ప్రదర్శితమై ప్రశంసలు అందుకోవడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోగ్రాండ్‌గా రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా  తెలుగు అఫీషియల్ ట్రైలర్‌ని  విడుదల చేసి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. 2 నిమిషాల 29 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ ఒక తీవ్రమైన సస్పెన్స్, మిస్టరీ క్రైమ్ డ్రామాగా సాగుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

కథ పరంగా ట్రైలర్ చూస్తే, మానసిక స్థితి సరిగ్గా లేని ఒక తల్లి, ఆ తల్లి ఏం చేస్తుందో తెలియక సతమతమయ్యే ఒక చిన్న పిల్లాడు, ఆ పిల్లాడు అకస్మాత్తుగా మిస్ అవ్వడం, అతడి కోసం పోలీసులు వెతకడం వంటి అంశాలతో సినిమా చాలా ఇంటెన్సివ్ మూడ్‌ని క్రియేట్ చేసింది. సుషిన్ శ్యామ్ అందించిన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, షైజు ఖాలిద్ విజువల్స్ ట్రైలర్ రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. అయితే విజువల్స్ పరంగా ఎంతో సీరియస్ మూడ్‌ని  క్రియేట్ చేసిన ఈ ట్రైలర్‌కు తెలుగు డబ్బింగ్ మాత్రం అతి పెద్ద మైనస్‌గా మారి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. తెలుగులో సరైన డబ్బింగ్ ఆర్టిస్టులతో చెప్పిస్తే ఎక్కడ బడ్జెట్ పెరిగిపోతుందో అని భావించారో ఏమో కానీ, మేకర్స్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని ఉపయోగించి డబ్బింగ్ చెప్పించినట్లు స్పష్టంగా తెలుస్తోందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.


Also read: స్టేజ్‌పై నడుము పట్టుకున్న ఆకతాయి.. చెంప పగలగొట్టిన డాన్సర్ డింపుల్ చౌదరి

ఈ ఏఐ డబ్బింగ్ కారణంగా ట్రైలర్‌లోని ఏ ఒక్క డైలాగ్‌లోనూ కనీస ఎమోషన్ కూడా కనెక్ట్ కాలేదని, సాధారణంగా ఇంగ్లీష్ సినిమాలకి వచ్చే డబ్బింగ్ కూడా దీనికంటే ఎంతో బెటర్‌గా ఉంటుందని సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శిస్తున్నారు. టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తుండటంతో, వారు ఇలాంటి ఘోరమైన డబ్బింగ్‌ని ఎలా ఎంకరేజ్ చేశారంటూ టాలీవుడ్ వర్గాలు.ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ డేట్ జూన్ 19 కి ఇంకా సమయం ఉన్నందున, అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు చిత్ర బృందం ఈ భారీ లోపాన్ని గమనించి, థియేట్రికల్ రిలీజ్ నాటికైనా మంచి డబ్బింగ్ ఆర్టిస్టులతో ఒరిజినల్ ఎమోషన్స్ పండేలా రీ డబ్బింగ్ చేయిస్తారని టాలీవుడ్ సినీ ప్రేమికులు ఆశిస్తున్నారు. 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com