Home

»

Latest News

సీన్ డైరెక్టర్ జీతూ మాధవన్ నెక్స్ట్ హీరో తెలిస్తే షాక్ అవుతారు: హీరోయిన్‌గా ఆ క్రేజీ బ్యూటీ!

Nov 9, 2026 3:59PM

 

ఇప్పుడు ఎక్కడ చూసినా సీన్  మూవీ డైరెక్టర్ జీతూ మాధవన్ పేరు మారుమోగిపోతూ ఉంది. మరో సారి తన అద్భుతమైన టేకింగ్ తో కథనాన్ని పరుగెత్తించి మరో సారి క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ పలానా హీరోతో ఉండబోతోందనే న్యూస్ సోషల్ మీడియాకి ఎనలేని జోష్ తీసుకొస్తూ ఉంది.  

జీతూ మాధవన్ నెక్స్ట్ మూవీ దుల్కర్ సల్మాన్ తో ఉండబోతున్నట్టుగా మలయాళ సినీ వర్గాల్లో బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, యూత్ హార్ట్ థ్రోబ్‌గా మారి దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ మమిత బైజు ఈ చిత్రంలో కథానాయకిగా నటించనుందనే రూమర్స్ సోషల్ మీడియాని షేక్ చెస్ చేసే పనిలో ఉన్నాయి ఈ అనూహ్య కాంబినేషన్ గురించిన ప్రకటన వెలువడినప్పటి నుంచి సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ఇటీవల మలయాళంలో చేసిన సినిమాలకు ఆశించిన స్థాయి ఫలితాలు రాలేదు. దీంతో  దుల్కర్ అభిమానులు ఒక బలమైన మలయాళ కంబ్యాక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ తరుణంలో నూతన ట్రెండ్‌కు తగినట్లుగా కథలను తెరకెక్కించడంలో దిట్ట అయి జీతూ మాధవన్‌తో దుల్కర్ జతకట్టనుండటం అభిమానులకి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.  మమిత బైజు హీరోయిన్ అంటుండటం మరింత తీపి వార్త. మరి ఈ న్యూస్ అక్షరాలా నిజం కావాలని కోరుకుందాం.

ఇది కూడా చదవండి: థియేటర్లలో భారీ బడ్జెట్ సినిమాల యాడ్స్: చిన్న సినిమాల ఫలితాన్ని మార్చేస్తున్నాయా?

జీతూ మాధవన్  మొదటి సినిమా 'రోమాంచకం' తోనే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించి మలయాళ ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆ తర్వాత ఫహద్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన 'ఆవేశం' సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏకంగా వందల కోట్ల వసూళ్లను రాబట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.

 

ఇప్పుడు  'సీన్' సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ కేవలం కేరళ బాక్సాఫీస్ వద్దే తొలి వారాంతంలో సుమారు 6 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టిస్తోంది. తద్వారా వరుసగా మూడు విజయాలను తన ఖాతాలో వేసుకున్న జీతూ  మాధవన్, టాలీవుడ్ మరియు కోలీవుడ్ డైరెక్టర్లకు సైతం గట్టి పోటీ ఇస్తూ హ్యాట్రిక్ డైరెక్టర్‌ హోదాలో దూసుకుపోతున్నాడు.

 

మీకు నచ్చవచ్చు:  ఈ నగరానికి ఏమైంది సీక్వెల్.. నెట్ ఫ్లిక్స్ ఎన్ని కోట్లకి కొనుక్కుందో తెలుసా?
మీకు నచ్చవచ్చు:రామాయణ దెబ్బకి ధురంధర్ 2 , పుష్ప రికార్డ్స్ అవుట్! 
 

 

[Jithu Madhavan Next Movie After scene Movie, Jithu Madhavan ANd Dulquer Salmaan Movie, Dulquer Salmaan, Jithu Madhavan, Mamitha Baiju,Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com