Home

»

Latest News

Peddi: పెద్దిపై అమితాబచ్చన్ వైఫ్ జయాబచ్చన్ కీలక వ్యాఖ్యలు.. సపోర్ట్ చేసినట్టేనా! లేదా!

Jun 9, 2026 10:42AM

 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan)వన్ మాన్ షో 'పెద్ది'(Peddi)ని పలు వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జాన్వీకపూర్ క్యారక్టర్ ని ప్రెజెంట్ చేసిన విధానం, గ్లామర్‌ని ప్రదర్శించిన యాంగిల్స్  తీరు  చర్చనీయాంశమయ్యింది. పలువురు సినీ ప్రముఖులు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. 
.
 తాజాగా ఈ  వివాదంపై అమితాబచ్చన్ వైఫ్, సీనియర్ నటి, పార్లమెంట్ సభ్యురాలు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఇలాంటి విషయాలని షూటింగ్ సెట్‌లోనే వెంటనే ఖండించాలి. గట్టిగా ఎదురించాలి. సినిమా పరిశ్రమలో తన సుదీర్ఘ కెరీర్‌లో ఎవరూ తనతో గీత దాటడానికి ధైర్యం చేయలేదు. మనోజ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'షోర్' సినిమాలో తను ఒక వీధి యువతిగా నటించినప్పుడు, కేవలం ఘాగ్రా-చోళీ మాత్రమే వేసుకోవాలని దర్శకుడు కోరగా, తాను దుపట్టా కప్పుకుంటానని ఖచ్చితంగా చెప్పి ఒప్పించాను. కేవలం ఒకే ఒక్కసారి ఒక దర్శకుడు తనను ఒక ఆబ్జెక్ట్‌గా చూపించడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత తాను జీవితంలో అతనితో మళ్లీ పని చేయలేదని జయా బచ్చన్ చెప్పుకొచ్చారు.

ఈ చర్చలోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ కూడా ప్రవేశించారు. స్క్రీన్ మీద సెన్సువాలిటీ లేదా గ్లామర్ పండించడానికి విచ్చలవిడిగా అంగప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. గతంలో 'కభీ ఖుషీ కభీ గమ్' సినిమాలో 'సూరజ్ హువా మద్ధమ్' పాటలో కాజోల్ శారీలోనే ఎంతో అందంగా కనిపించారని, అలాగే 'చాందిని'లో శ్రీదేవి, 'ఆరాధన'లో తన అత్తగారు షర్మిలా ఠాగూర్ ఒళ్లంతా కప్పుకునే నటించినా ఎంతో ఆకర్షణీయంగా కనిపించారని ఉదాహరణలతో వివరించారు. మరోవైపు సీనియర్ నటి ఆశా పరేఖ్ కూడా ఒకప్పుడు ఒక దర్శకుడు తనను అసభ్యకరమైన బట్టలు వేసుకోమంటే, "మీ కూతురు ఇలాంటి బట్టలు వేసుకుంటే మీరు సంతోషిస్తారా?" అని కళ్లల్లోకి చూసి అడిగితే ఆ డ్రెస్ మార్చేశారని గుర్తుచేసుకున్నారు.

ప్రేక్షకుల నుంచి వస్తున్న తీవ్రమైన విమర్శలు, సెలబ్రిటీల రియాక్షన్ల మధ్య ‘పెద్ది’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సన ఎట్టకేలకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. సినిమా అనేది ప్రేక్షకులను అలరించడానికి, స్ఫూర్తినింపడానికి ఉండాలి తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. వివాదాస్పదమైన సీన్లను, ఆ క్లోజప్ షాట్లను సినిమా నుండి తొలగిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ వివాదాలు ఎలా ఉన్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం ‘పెద్ది’ చిత్రం దూసుకుపోతోంది. పెద్ది ప్రస్తుతం 300 కోట్ల క్లబ్ లోకి చేరింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com