
సినిమా ప్రమోషన్లను కూడా ఓ వినోదాత్మక కార్యక్రమంలా మార్చడంలో దర్శకుడు అనిల్ రావిపూడి స్టైలే వేరు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచే ఆసక్తికరమైన వీడియోలు, ఫన్నీ అప్డేట్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇప్పుడు వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’ కోసం కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.
తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్లకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను మూవీ టీమ్ విడుదల చేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్, శోభన నటించిన మణిరత్నం క్లాసిక్ ‘దళపతి’ సినిమాలోని ఓ ఐకానిక్ సీన్‌ను అనిల్ రావిపూడి, కృతి శెట్టి కలిసి రీక్రియేట్ చేశారు.
ఈ వీడియోలో కీర్తి సురేష్, కృతి శెట్టి ఓ గర్ల్స్ సాంగ్ కోసం రీల్ చేయాలని అనుకుంటారు. అయితే తను లేకుండా రీల్ చేస్తుండటంతో అనిల్ రావిపూడి హర్ట్ అవుతారు. దాంతో ప్రమోషన్ల విషయం వస్తే చాలు వెంటనే వచ్చేస్తాడనే అర్థం వచ్చేలా అనిల్‌పై సరదాగా సెటైర్లు వేశారు హీరోయిన్లు.

‘ప్రమోషన్స్ అంటే చాలు.. అందరికంటే ముందుంటాం’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను విడుదల చేశారు. సినిమా ప్రమోషన్లలో అనిల్ రావిపూడి ఎంత యాక్టివ్‌గా ఉంటారో మరోసారి ఈ వీడియోతో సరదాగా చూపించారు. ఇక కీర్తి, కృతి స్టెప్స్ కూడా అదిరిపోయాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
ఇది కూడా చదవండి: భర్త కోసం న్యాయ పోరాటం.. కీర్తి సురేష్‌ని ఎవరూ పట్టించుకోట్లేదేంటి.?
ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్లను నవంబర్ 20 నుంచి ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో ముందుగానే మ్యూజిక్ ప్రమోషన్లు మొదలుపెడుతున్న చిత్రంగా ‘జనవరి 12 విడుదల’ నిలుస్తోంది. ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావాబామ్మర్దులుగా కనిపించనున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
మీకు నచ్చవచ్చు:
సాత్విక వీరవల్లి.. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే వరుస ఆఫర్లు.!
బాలకృష్ణ 'దాదా' లేటెస్ట్ అప్డేట్.. సినిమాలో అదిరిపోయే ట్విస్ట్.!
[January 12 Vidudala, Anil Ravipudi, Thalapathi Scene, Keerthy Suresh, Krithi Shetty]






