Home

»

Latest News

Janhvi kapoor: జాన్వీ కపూర్ వీడియో వైరల్.. పెద్దికి ప్లస్ అవుతుందంటారా

Mar 06, 2026


-వీడియోలో ఏముంది
-ఈ రోజు జాన్వీ బర్త్ డే కదా 
-ప్రెజెంట్ తిరుపతిలో 


చాలా సినిమాల్లో విలన్స్ నోటి నుంచి ఆవేశంగా బళ్ళు తియ్యండిరా అనే మాట తరచుగా వస్తుంటుంది. మరి వాళ్ళు ఆ ఆవేశంతో వెళ్లాల్సిన ప్లేస్ కి వెళ్తారో లేక భయంతో మధ్యలోనే డ్రాప్ అవుతారో తెలియదు గాని, ఇప్పుడు పెద్ది(Peddi)నుంచి మేకర్స్  రిలీజ్ చేసిన వీడియో దెబ్బకి ఇప్పటి నుంచే బళ్ళు రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇంత మాస్ గా పెద్ది గురించి ఉదహరించడానికి  కారణం, మేకర్స్  ఎక్స్ క్లూజివ్ గా  రిలీజ్ చేసిన వీడియో.  పూర్తి మాటర్ ఏంటో చూద్దాం.

ఈ రోజు జాన్వీకపూర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకి విషెస్ చెప్తూ మేకర్స్ సుమారు 28 సెకన్ల వీడియో రిలీజ్ చేసారు. సదరు వీడియో ద్వారా 'పెద్ది' లో అచ్చాయమ్మా గా జాన్వీ సృషించబోయే ప్రభంజనం ఏ మేర ఉండబోతుందో చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. వేష ధారణ, మాట తీరుతో ఉత్తరాంధ్ర అమ్మాయితో సరదాకైనా సరే  పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా పెద్ది ద్వారా చెప్పబోతోంది. టోటల్ గా పెద్దికి తగ్గ జోడి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పైన మనం చెప్పుకున్న బళ్ళు తియ్యండిరా పెద్ది కి వెళ్ళాలి  అనే కామెంట్స్  అభిమానుల దగ్గర నుంచి వినపడుతున్నాయి.

also read: Anasuya: అనసూయ మళ్ళీ వచ్చేసింది.. ఆ పోస్ట్ ఖచ్చితంగా వీళ్ళని ఉద్దేశించి చేసిందే 


ఏప్రిల్ 30 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా స్థాయిలో రామ్ చరణ్(Ram Charan)కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రీసెంట్ గా వచ్చిన సెకండ్ సింగిల్ 'రై రై రా రా' సాంగ్ ఫస్ట్ సింగిల్ చికిరి ని క్రాస్ చేస్తూ మురిసిపోవడం ఒకరి సొత్తు కాదని నిరూపించింది. మరి మిగతా సాంగ్స్ రాకతో 'రై రై రా రా' కి కూడా ఆ పరిస్థితి వస్తుందేమో చూడాలి. జాన్వీ కపూర్ ప్రస్తుతం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంలో ఉంది. తన తల్లి అతిలోక సుందరి శ్రీదేవి స్వస్థలం తిరుపతి అనే విషయం తెలిసిందే.  

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com