Home

»

Latest News

Janhvi kapoor: పెద్ది అచ్చాయమ్మ పరిస్థితి ఏంటి.. దేవర పరువు నిలబడుతుందా!

Jun 3, 2026 12:08PM

 


అతిలోకసుందరి శ్రీదేవి(Sridevi)నట వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్(Janhvi Kapoor), బాలీవుడ్‌లో సరైన బ్రేక్ ని అందుకోలేకపోయింది. కానీ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో  'దేవర' తో జత కట్టి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. హిట్ అందుకోవడమే కాదు. తంగం అనే పల్లెటూరి అమ్మాయి రోల్ లో మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ చేసింది. గ్లామర్ పరంగానే కాకుండా, ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించి తల్లి శ్రీదేవిని మరిపించింది. 

'దేవర' ఇచ్చిన జోష్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పెద్దిలో జత కట్టింది. ప్రచార చిత్రాలు చూస్తుంటే అచ్చాయమ్మ గా మరో సారి తన హవా చాటడం ఖాయమని అనిపిస్తుంది. దేవర, పెద్దిని గమనిస్తే జాన్వీ తన టాలీవుడ్ టాప్ లీగ్‌ ని  ఎంత పక్కాగా ప్లాన్ చేసుకుందో అర్థమవుతుంది. 'దేవర' సినిమా ఆమెకు కమర్షియల్ సక్సెస్‌తో పాటు మాస్ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు 'పెద్ది' సినిమా ఆమెలోని నటనను, విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఎమోషన్స్‌ని  మరింత పీక్స్‌కి  తీసుకెళ్లే అవకాశం ఉంది. టాలీవుడ్‌లో ఒక హీరోయిన్ వరుసగా ఇద్దరు టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకొని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడితే, ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. 

Also read: Peddi: పెద్దితో బుచ్చిబాబు ఆ గండాన్ని దాటబోతున్నాడా!

ప్రస్తుతం టాలీవుడ్‌లో రష్మిక మందన్న, శ్రీలీల లాంటి స్టార్ హీరోయిన్లు ఉన్నప్పటికీ, జాన్వీ కి  ఉన్న క్రేజ్, స్టార్ కిడ్ ఇమేజ్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు రేసులో అందరికంటే ముందు నిలబెడతాయి. దీంతో జాన్వీ తెలుగు సినిమా నంబర్ వన్ హీరోయిన్ స్థానాన్ని అందుకోవడం ఖాయమని అభిమానులు, సినీ విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com