
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా జాన్వీ నటించిన లేటెస్ట్ ప్రాజెక్ట్ 'పెద్ది' (Peddi) చిత్రంలో ఆమెను చూపించిన విధానంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ తీవ్ర విమర్శల మధ్యలోనే జాన్వీ కపూర్‌కు సంబంధించిన కొన్ని వ్యక్తిగత చాట్స్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం ఇప్పుడు సరికొత్త సంచలనానికి తెరలేపింది.
వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఈ లీకైన చాట్స్‌లో జాన్వీ కపూర్ పెద్ది సినిమా షూటింగ్ సమయంలో కెమెరా యాంగిల్స్ గురించి మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక నిర్దిష్ట సీన్ లేదా సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు కెమెరాను తప్పుగా, కాస్త ఇబ్బందికరమైన యాంగిల్స్‌లో సెట్ చేశారంటూ ఆమె తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ఆ చాట్స్ ద్వారా తెలుస్తోంది. కొన్ని శరీర భాగాలను హైలైట్ చేసేలా కెమెరా యాంగిల్స్ పెట్టారు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసినట్లుగా ఉన్న మెసేజ్‌లు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అయితే ఈ విషయంలో రామ్ చరణ్ తనకు మద్దతుగా నిలిచారని జాన్వీ కపూర్ చెప్పినట్లుగా ఆ చాట్ లో ఉంది. రామ్ చరణ్ స్వీట్ పర్సన్ అని, ఆయన కూడా ఇలాంటి ఇబ్బందికర కెమెరా యాంగిల్స్ పెట్టవద్దని చెప్పారని అందులో జాన్వీ చెప్పడం విశేషం.
మొత్తానికి జాన్వీ కపూర్ లీక్డ్ చాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మరి ఈ ఇష్యూపై జాన్వీ కపూర్ నోరు విప్పుతుందేమో చూడాలి.






