
ఇళయ దళపతి విజయ్(Vijay)అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ నెల 23 న 'జననాయగన్' (జననాయకుడు)తో థియేటర్స్ లో తిష్ట వేయడానికి రాబోతుండటంతో అభిమానుల ముఖాలు మాములు ఆనందంతో లేవు. పైగా విజయ్ చివరి మూవీ కావడంతో భావోద్వేగ వాతావరణంలో థియేటర్స్ లోకి అడుగుపెట్టడం ఖాయం.
ఇక ఇండియాతో పాటు విదేశాల్లోను ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి. అయితే, ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో 'జననాయగన్' మొదటి రోజు కలెక్షన్లపై ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సాధారణంగా విజయ్ నటించిన గత చిత్రాలైన 'లియో' వంటి సినిమాలకు ఉన్నంత స్థాయి భారీ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్, ఈ సినిమాకు డొమెస్టిక్ మార్కెట్‌లో కొంత నెమ్మదించినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా గతంలో ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం, విడుదల పలుమార్లు వాయిదా పడటం వంటి ప్రతికూల అంశాలు సినిమా ప్రీ రిలీజ్ హైప్‌ని కొంతవరకు దెబ్బతీశాయని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ వన్ మాన్ షో 'కూలీ' లేదా విజయ్ సొంత చిత్రం 'లియో' సృష్టించిన ఆల్-టైమ్ రికార్డులను అందుకోవడం ఈ చిత్రానికి ప్రస్తుత ట్రెండ్ ప్రకారం కాస్త కష్టంగానే మారేలా కనిపిస్తోంది. అయినప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే డొమెస్టిక్ మార్కెట్‌లో 'జననాయగన్' సుమారు రూ. 6.7 కోట్ల గ్రాస్ (బ్లాక్డ్ సీట్లతో కలిపి) వసూలు చేసి తన సత్తా చాటింది. కేవలం తమిళ వెర్షన్ లోనే 2,399 షోలకు గానూ 1.33 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడై రూ. 3.86 కోట్ల మార్కును దాటింది. కర్ణాటకలో రూ. 2.59 కోట్లు, కేరళలో రూ. 1.32 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు కావడం విజయ్కున్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
Also read: ది ఒడిస్సీ vs హైదరాబాద్.. షాక్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులు!
బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో కొన్ని ప్రీమియం రిక్లైనర్ సీట్ల టికెట్ ధరలు ఏకంగా2,500 వరకు పలికినప్పటికీ, నిమిషాల్లోనే షోలు హౌస్‌ఫుల్ కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎలాంటి ప్రభావం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్‌ను సాధించగలదా అనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. రజనీకాంత్ 'కూలీ' సాధించిన రూ. 151 కోట్ల రికార్డు లేదా 'లియో' సాధించిన రూ. 148.5 కోట్ల గ్లోబల్ ఓపెనింగ్స్ రికార్డులను దాటడం పెద్ద సవాలే అని చెప్పాలి. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత మొదటి రోజే గనుక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం, బాక్సాఫీస్ గమనం పూర్తిగా మారిపోతుందని, విజయ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా చరిత్ర సృష్టిస్తాడని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్ కీ రోల్స్ లో కనిపిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్.
jananayagan, vijay, pooja hegde, mamintha bhaiju, anirudh






