Home

»

Latest News

సెంచ్యురీ క్లబ్ లో జగపతి బాబు

Apr 5, 2011 4:22PM

jagapathi babu wallpapers, jagapathi babu stills, jagapathi babu images, jagapathi babu pics, jagapathi babu photos, jagapathi babu picturesసెంచ్యురీ క్లబ్ లో జగపతి బాబు చేరుతున్నారట. దీనర్థం జగపతి బాబు తెలుగు సినీ పరిశ్రమలో వంద సినిమాలు పూర్తిచేసిన హీరోల సరసన తన పేరు కూడా నమోదు చేసుకోబోతున్నాడట. ఇటివల "మహాత్మ" చిత్రంతో హీరో శ్రీకాంత్ వంద సినిమాలు పూర్తిచేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ తెలుగు హీరో జగపతిబాబు త్వరలో వంద సినిమాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఆ వందవ చిత్రానికి ఒక పెద్ద డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం.


 

ఈ చిత్రాన్ని విశాఖ టాకీస్ పతాకంపై నట్టి కుమార్ నిర్మించనున్నారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇటీవల నట్టి కుమార్ నిర్మాతగా ఆ బ్యానర్ లోనే జగపతిబాబు హీరోగా, విమలా రామన్ హీరోయిన్ గా, అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన "చట్టం" చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.జగపతి బాబు నంటించబోయే వందవ చిత్రం చాలా భారీగా ఉండబోతుందని, ఈ చిత్రం 2011 ఆగస్టు నెలలో ప్రారంభం కావచ్చని అనుకుంటున్నారు. జగపతి బాబు హీరోగా నటించిన తొలి చిత్రం"అభిమన్యుడు".

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com