
ఇరుముడి మేకర్స్ పుణ్యం చేసుకున్నారో, నటీనటులు పుణ్యం చేసుకున్నారో, లేక ప్రేక్షకులు పుణ్యం చేసుకున్నారో లేదో తెలియదు గాని మీ పుణ్యం చల్లగుండా అనే వర్డ్ ని
నిత్యం తెలుగు సినిమా ప్రేమికులు, ప్రేక్షకులు చెప్పుకునే పరిస్థితి.
ఇరుముడి నిన్న శుక్రవారం (సెప్టెంబర్ 18) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. సాధారణంగా ఒక సినిమా ఓటీటీలోకి వస్తే ప్రజలు తమ ఇళ్లలోనే స్మార్ట్ టీవీల్లో లేదా మొబైల్ ఫోన్లలో డిజిటల్ స్క్రీన్లకు పరిమితమై ఒంటరిగా వీక్షిస్తుంటారు. కానీ 'ఇరుముడి' విషయంలో మాత్రం పల్లెటూర్లలో సరికొత్త విప్లవాత్మక దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రస్తుతం జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామీణ సెంటర్లు, వీధులు, గల్లీలలోని మండపాల వద్ద స్థానికులు పెద్ద టీవీ స్క్రీన్లు, బిగ్ ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి ఉచితంగా చూపిస్తున్నారు.
Also Read: నాలుగేళ్లు ఆ డైరెక్టర్ ఇంటి గేటు బయటనే: శ్రీకాంత్ ఓదెల వ్యాఖ్యలు వైరల్
రాత్రి వేళల్లో ఊరి పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఒకేచోట కలిసి కూర్చుని సినిమా చూస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చిత్రంలోని 'ఇరుముడి కట్టు', 'మల్లెపూల పల్లకి' వంటి ప్రజాదరణ పొందిన జానపద, భక్తి గీతాలు ప్లే అవుతున్న సమయంలో వయస్సుతో సంబంధం లేకుండా పిల్లా పెద్దలు ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తున్నారు. మరోవైపు తండ్రీకూతుళ్ల బాండింగ్ క్లైమాక్స్ సన్నివేశాలు వస్తున్నప్పుడు వేలాది మంది కంటతడి పెట్టుకోవడం ఆ సన్నివేశాలలోని గాఢతను చాటిచెబుతోంది.

ఒకప్పుడు ప్రొజెక్టర్ రయ్యిమని తిరుగుతుంటే కళ్లప్పగించి చూసే ఆనాటి టూరింగ్ టాకీస్ అనుభూతిని ఈ దృశ్యాలు పునరావృతం చేస్తున్నాయి. థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టించిన 'ఇరుముడి' ఇప్పుడు ఓటీటీ ద్వారా పల్లెటూరి వీధుల్లో పండగ వాతావరణాన్ని నింపి, తెలుగు ప్రజలను మళ్లీ ఒకే వేదికపైకి తెచ్చి కట్టిపడేస్తోంది. అందుకే మీ పుణ్యం చల్లగుండా అనే వర్డ్ నిత్యం తెలుగు ప్రేక్షకుల నోళ్ళల్లో నానుతూ ఉంది.
మీకు నచ్చవచ్చు : తేట తేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా..' తెలుగు వారి మనసుల్లో గుడి కట్టుకున్న పాట.!
[Irumudi Village Open Screenings, Irumudi Ott Records, Irumudi, Raviteja, Shiva Nirvana, Telugu Cinema, telugu cinema News, Tollywood, Tollywood News]






