Home

»

Latest News

నాలుగేళ్లు ఆ డైరెక్టర్ ఇంటి గేటు బయటనే: శ్రీకాంత్ ఓదెల వ్యాఖ్యలు వైరల్

Sep 19, 2026 5:59PM


సినీ రంగంలో దర్శకుడు అవ్వడమంటే అంత ఈజీ కాదు. కానీ డైరెక్టర్ అయ్యి  బ్లాక్ బస్టర్ హిట్ కొడితే మాత్రం ఏ జన్మలో చేస్తుకున్న అదృష్టమో అని అందరూ చూసి అసూయా పడే పరిస్థితి. సింపుల్ గా చెప్పాలంటే దేశంలో ఉండే అత్యున్నత పదవులు కూడా సినీ డైరెక్టర్ ముందు దిగదుడుపు అని సినీ అభిమానులు చెప్తుంటారు. 

ఇప్ప్పుడు ది ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పరిస్థితి కూడా అదే. నానితో 'దసరా' వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టి, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 121 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించిన  శ్రీకాంత్  తెలంగాణలోని గోదావరిఖనికి చెందిన ఈ యంగ్ డైరెక్టర్, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి తన కలని  నిజం చేసుకున్నాడు . ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఓదెల తన గురువు, ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ను కలవడానికి పడిన నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ గురించి పంచుకున్న ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో సుకుమార్ దర్శకత్వ శైలికి ఎంతగానో ఆకర్షితుడైన శ్రీకాంత్ ఓదెల, ఆయన వద్ద సహాయ దర్శకుడిగా పనిచేయాలని బలంగా నిశ్చయించుకున్నారు. అందుకోసం ప్రతిరోజూ సుకుమార్ ఇంటి ముందుకు వెళ్లి గేటు బయటే గంటల తరబడి నుంచొనేవారు. అలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, ఏకంగా 4 సంవత్సరాల పాటు ఓపికగా నిరీక్షించారు. ప్రతిరోజూ గేటు బయట తనకోసం నుంచుంటున్న ఈ కుర్రాడి పట్టుదలను గమనించిన సుకుమార్, ఒకరోజు శ్రీకాంత్‌ను లోపలికి పిలిచి మాట్లాడారు. ముందుగా ఒక షార్ట్ ఫిలిం చేయమని ప్రోత్సహించి శ్రీకాంత్ ప్రతిభను పరీక్షించారు. శ్రీకాంత్ చేసిన ఆ ప్రయత్నం నచ్చడంతో ఆయనలోని మేధస్సును, సినిమా పట్ల ఉన్న అంకితభావాన్ని గుర్తించి తన దర్శకత్వ శాఖలోకి సహాయకుడిగా తీసుకున్నారు.


ఇది కూడా చదవండి: మేకర్స్ ,హీరో, హీరోయిన్స్ కి షాక్: జయహో ప్రేక్షక మహాదేవా!

ఆ తర్వాత సుకుమార్ తెరకెక్కించిన 'నాన్నకు ప్రేమతో' (2016), మరియు రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ హిట్ 'రంగస్థలం' (2018) చిత్రాలకు శ్రీకాంత్ ఓదెల అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ రెండు పెద్ద ప్రాజెక్టులపై పనిచేస్తున్న సమయంలోనే సినిమా మేకింగ్, కథనంలో ఉండాల్సిన డెప్త్, ప్రతి పాత్రను మలిచే విధానంలో సుకుమార్ పాటించే మెళకువలను ప్రత్యక్షంగా నేర్చుకున్నారు. 'రంగస్థలం' సినిమా నిర్మాణం సమయంలో సుకుమార్ ఏ రూమ్‌లో, ఏ కుర్చీలో కూర్చుని కథా చర్చలు సాగించేవారో, సీన్లు ప్లాన్ చేసేవారో శ్రీకాంత్ దగ్గరుండి చూశారు. కాలం ఎంత వేగంగా మారుతుందో చెప్పడానికి శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ లైవ్ ఉదాహరణగా నిలిచింది.

 

తన మొదటి చిత్రం 'దసరా' ఘన విజయం సాధించిన తర్వాత, నానితోనే తన రెండవ భారీ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' ను శ్రీకాంత్ ఓదెల ప్రారంభించారు. ఈ చిత్ర ఆఫీస్ పనుల కోసం ఆయన ఎంచుకున్న రూమ్ మరేదో కాదు, ఒకప్పుడు తన గురువు సుకుమార్ 'రంగస్థలం' మేకింగ్ కోసం ఉపయోగించిన అదే ఆఫీస్, అదే రూమ్! అంతేకాదు, ఒకప్పుడు తను అసిస్టెంట్‌గా నిలబడి ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్న ఆ గదిలో, ఈరోజు అదే సుకుమార్ కూర్చున్న కుర్చీలోనే శ్రీకాంత్ ఓదెల ఒక స్టార్ డైరెక్టర్‌గా కూర్చుని 'ది ప్యారడైజ్' పనులను పర్యవేక్షిస్తున్నారు.

తొలిసారి ఆ కుర్చీలో కూర్చునే ముందు "నేను ఈ కుర్చీలో కూర్చోవచ్చా లేదా" అని కాస్త తడబడ్డానని, ఆ క్షణం కళ్లలో నీళ్లు తిరిగాయని ఎమోషనల్ అయ్యారు శ్రీకాంత్. నాలుగేళ్లు గేటు బయట నుంచున్న చోటు నుండి, 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే స్థాయికి ఎదిగిన శ్రీకాంత్ ఓదెల ప్రయాణం ప్రతి ఒక్క సినీ ప్రేమికుడికి, సినీ ఆశావాదులకి గొప్ప స్ఫూర్తినిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.   


 మీకు నచ్చవచ్చు : అందాల ఆడబొమ్మ: బాలయ్య ఆల్ టైం క్లాసిక్ సాంగ్.! 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com