Home

»

Latest News

'ఇరుముడి' బిజినెస్: రవితేజ ఖాతాలో హిట్ పడాలంటే అన్ని కోట్లు రాబట్టాలి.!

Aug 20, 2026 6:39PM

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కలసి కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం రేపు(ఆగష్టు 21) థియేటర్లలో అడుగుపెట్టనుంది.

'ఇరుముడి' సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ఆడియన్స్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. తండ్రి-కూతుళ్ళ అనుబంధం, అయ్యప్ప దీక్ష నేపథ్యం, అద్భుతమైన పాటలు, పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ కలగలిపి రూపుదిద్దుకున్న ఈ చిత్రం రవితేజకు పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇస్తుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఇక బిజినెస్ లెక్కల విషయానికి వస్తే.. 'ఇరుముడి' సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. రవితేజ కెరీర్‌లో రీసెంట్ ఫ్లాప్‌లను పరిగణనలోకి తీసుకుని, బయ్యర్లకు ఏమాత్రం రిస్క్ లేని విధంగా చాలా రీజనబుల్ అండ్ సేఫ్ ప్రైస్‌కే ఈ రైట్స్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రాంతాల వారీగా బిజినెస్ చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లోదాదాపు రూ.16 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ హక్కులు కలిపి దాదాపు రూ. 4 కోట్లకు అమ్ముడయ్యాయి.

దీంతో 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించి, క్లీన్ హిట్‌గా నిలవాలంటే..  రూ. 21 కోట్ల షేర్ (రూ. 40 కోట్ల వసూళ్లు) సాధించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 40 కోట్ల గ్రాస్ మార్క్ దాటితే 'ఇరుముడి' సేఫ్ జోన్‌లోకి వచ్చి, మాస్ మహారాజాని హిట్ ట్రాక్ ఎక్కిస్తుంది.

అడ్వాన్స్ బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దానికి పాజిటివ్ టాక్ కూడా తోడైతే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడం ఖాయమే.

 

 

 

Irumudi Movie, Ravi Teja, Shiva Nirvana

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com