Home

»

Latest News

200సార్లు కన్ను కొట్టా: ప్రియా ప్రకాష్ వారియర్

Jan 28, 2019 3:09PM

 

ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌కి ఒక్క సినిమాతో దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ వ‌చ్చింది. అలాగే, పాపులారిటీతో పాటు ప్రాబ్ల‌మ్స్ కూడా! మలయాళ సినిమా 'ఒరు ఆడార్ లవ్'లో ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను కొట్టిన సన్నివేశం ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో ఎక్కడికి వెళ్లినా తనను ఓసారి అలా కన్ను కొట్టమని అడుగుతున్నారని, తనకు బోర్ కొడుతుందని ప్రియా ప్రకాష్ అంటున్నారు. 

ఇప్పటికి ఓ రెండొందల సార్లు కన్ను కొట్టానని ప్రియా ప్రకాష్ వారియర్ తెలిపారు. సినిమా ప్రచార కార్యక్రమాల నిమిత్తం ఇప్పటికి రెండొందల సార్లు కన్ను కొట్టిన ఆమె, సినిమా చిత్రీకరణలో ఎన్నిసార్లు కన్ను కొట్టారో తెలుసా? ఒక్కసారే. సింగిల్ టేక్‌లో ఆ సీన్ కంప్లీట్ చేశానని ప్రియా ప్రకాష్ వారియర్ చెప్పారు. ప్రియ ప్రకాష్ వారియర్ కి వచ్చిన క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలలో అనువదించి విడుదల చేస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న లవర్స్ డే పేరుతో తెలుగులో ఈ సినిమా విడుదల కానుంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com