Home

»

Latest News

ఆ పార్టీలో నేనూ ఉన్నానంటున్న నటుడు బ్రహ్మాజీ

Mar 26, 2016 3:58PM

ఈరోజు ఉదయం నవదీప్ గురించి వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు తెలుసుకోకుండా, ఇష్టం వచ్చినట్టు రాసేశారంటూ నవదీప్ ఇప్పటికే తన ట్విట్టర్లో జర్నలిస్టులను సూటిగా ప్రశ్సిస్తున్నాడు. తన తల్లితో, ఫ్యామిలీ సభ్యులు, పిల్లలతో గడిపిన ఆ పార్టీని రేవ్ పార్టీగా మీడియా చిత్రీకరించిందని నవదీప్ మండిపడుతున్నాడు. తాజాగా నటుడు బ్రహ్మాజీ నవదీప్ కు సపోర్ట్ చేశారు. రేవ్ పార్టీ అని పోలీసుల అరెస్ట్ అంటూ వచ్చిన కథనాలు పూర్తి నిరాధారమైనవనీ, ఆ సమయంలో తన కుటుంబంతో తాను అక్కడే ఉన్నానని ట్వీట్ చేశారు.

అది కేవలం పిల్లలు, కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఒక ఫాం హౌస్ ప్రైవేట్ పార్టీ అని బ్రహ్మాజీ చెబుతున్నాడు. నవదీప్ కూడా నా రేవ్ పార్టీ ఫోటోలు ఇవే అంటూ పార్టీ ఫోటోలు పోస్ట్ చేశాడు. పిల్లలు కుండలు చేస్తూ, డ్యాన్సులు వేస్తూ ఉన్న ఆ ఫోటోలు చూస్తే, రేవ్ పార్టీ అని న్యూస్ పుట్టించిన వారిమీద నవదీప్ కు కోపం రావడంలో తప్పు లేదనిపించకమానదు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com