Home

»

Latest News

స్పోర్ట్స్ డ్రామాస్ క్లాష్ః `గుడ్ ల‌క్ స‌ఖి` వ‌ర్సెస్ `ల‌క్ష్య‌`!

Nov 24, 2021 4:16PM

ఈ డిసెంబ‌ర్ 10 టాలీవుడ్ కి ఎంతో ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే.. ఆ రోజు రెండు స్పోర్ట్స్ డ్రామాలు థియేట‌ర్స్ ముంగిట సంద‌డి చేయ‌నున్నాయి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. కేర‌ళ‌కుట్టి కీర్తి సురేశ్ టైటిల్ రోల్ లో న‌టించిన స్పోర్ట్స్ డ్రామా `గుడ్ ల‌క్ స‌ఖి`. షూటింగ్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో కీర్తి షూట‌ర్ గా క‌నిపించ‌నుంది. విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు కోచ్ గా న‌టించిన ఈ సినిమా.. డిసెంబ‌ర్ 10న రిలీజ్ కానుంది. క‌ట్ చేస్తే.. అదే రోజున నాగ‌శౌర్య న‌టించిన మ‌రో స్పోర్ట్స్ డ్రామా రాబోతోంది. ఆ చిత్ర‌మే.. `ల‌క్ష్య‌`.  ఆర్చ‌రీ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలోనూ జ‌గ‌ప‌తి బాబు ముఖ్య పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుండ‌డం విశేషం. మ‌రి.. ఒకే రోజు రాబోతున్న ఈ విభిన్న క్రీడా నేప‌థ్య చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటాయో చూడాలి. అలాగే, ట్రాక్ త‌ప్పిన కీర్తి, నాగ‌శౌర్య‌ని మ‌ళ్ళీ విజ‌య‌ప‌థంలోకి తీసుకువ‌స్తాయా?  లేదా? అన్న‌ది కూడా ఆస‌క్తిక‌ర‌మే.

కాగా, `గుడ్ ల‌క్ స‌ఖి`కి న‌గేశ్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. `ల‌క్ష్య‌`ని ధీరేంద్ర సంతోష్ జాగ‌ర్ల‌పూడి డైరెక్ట్ చేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com