నెట్ ఫ్లిక్స్ చేతికి మెగాస్టార్ 'గాడ్ ఫాదర్'!
on Sep 18, 2022
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం 'గాడ్ ఫాదర్'. మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కి రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ భారీస్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది.
సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ కి సంబంధించి ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మేకర్స్ థియేటర్స్ లో ఓన్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. థియేటర్స్ లో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో సందడి చేసే అవకాశముంది.
ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది 'ఆచార్య'తో తీవ్రంగా నిరాశపరిచిన మెగాస్టార్ 'గాడ్ ఫాదర్'తో లెక్క సరి చేస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read