ఐదు వసంతాల దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ స్కూల్
on May 26, 2022
జాతీయ స్థాయి ఉత్తమ నటి రేవతితో ముప్పై ఏళ్ల క్రితం 'అంకురం' రూపొందించి.. రివార్డులతోపాటు... లెక్కకు మిక్కిలి అవార్డులు కొల్లగొట్టిన ప్రముఖ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు తాజాగా మళ్లీ రేవతితోనే 'ఇట్లు అమ్మ' రూపొందించి... మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. 'ఇట్లు అమ్మ' జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో 76 అవార్డులు గెలుచుకుంది. 'సూర్యపుత్రులు', 'మౌనం', 'శ్రీకారం' వంటి రివార్డ్స్ అండ్ అవార్డ్స్ విన్నింగ్ ఫిల్మ్స్ రూపొందించి... దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సి.ఉమామహేశ్వరరావు... సినిమాలతో బిజీగా ఉంటూనే గత ఐదేళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా 'దాదా సాహెబ్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్' నిర్వహిస్తున్నారు.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కళాతపస్వి కె.విశ్వనాథ్ చేతుల మీదుగా మొదలైన "దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్"... అగ్ర తెలుగు చిత్రసీమకు గత ఐదేళ్లుగా ఎందరో ప్రతిభావంతుల్ని పరిచయం చేస్తోంది. "అంతర్జాతీయ ప్రమాణాలు... అందరికీ అందుబాటులో ఫీజులు" అనే సిద్ధాంతంతో ప్రగతిపథంలో దూసుకుపోతున్న "దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్" మరికొద్ది రోజుల్లో 5 వ వార్షికోత్సవం జరుపుకోనున్న సందర్భంగా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ... "యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీలకు మాత్రమే పరిమితం కాకుండా... ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, ఆడియోగ్రఫి, డిజిటల్ మ్యూజిక్ ప్రొడక్షన్ వంటి సౌండ్ కి సంబంధించిన కోర్సులు సైతం ఉండడం మా ఫిల్మ్ స్కూల్ ప్రత్యేకత. ఇప్పటివరకు మా స్కూల్ లో కోర్సులు చేసినవారంతా... ఇండస్ట్రీలో వివిధ శాఖల్లో విశేషంగా రాణిస్తున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్, రీజినల్ సినిమాలపై సమగ్ర అవగాహన కలిగేలా సిలబస్ డిజైన్ చేశాం. ఫిల్మ్ స్కూల్ కు సంబంధించి అల్లు అరవింద్, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతల సలహాలు-సూచనలు, సహాయ సహకారాలు మరువలేనివి. నా తదుపరి చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే అధికారికంగా పూర్తి వివరాలు ప్రకటిస్తాం" అన్నారు.
Also Read