ఫస్ట్ విజయ్.. నెక్స్ట్ అజిత్.. ఆపై కమల్.. ప్రభాస్ హీరోయిన్ దూకుడే వేరప్పా
on Sep 13, 2023

కథానాయికగా 20 ఏళ్ళ కెరీర్ పూర్తిచేసుకుంటున్నా.. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్ తో ముందుకు సాగడం అంటే మాటలు కాదు. అయితే, దీన్ని సుసాధ్యం చేస్తోంది ఓ స్టార్ బ్యూటీ. వరుస విజయాలతో.. అంతకుమించి క్రేజీ ఆఫర్స్ తో ఆ అందాల తార ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది.
ఇంతకీ ఆ భామ ఎవరంటే.. చెన్నై పొన్ను త్రిష. తెలుగులో ప్రభాస్ వర్షం(2004) మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన త్రిష.. ఆనక ఏకకాలంలో టాలీవుడ్, కోలీవుడ్ లో బిజీ యాక్ట్రస్ గా మారిపోయింది. రెండు చోట్ల దాదాపు అందరు అగ్రకథానాయకులతోనూ చిందేసింది. ఆమధ్య త్రిష జోరు కాస్త తగ్గినట్లు కనిపించినా.. 96 మూవీ పుణ్యమా అని మళ్ళీ తన హవా సాగుతోంది. ఇక పొన్నియన్ సెల్వన్ సిరీస్ సక్సెస్ తోనైతే మరోసారి స్టార్స్ తో జట్టుకట్టే అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం విజయ్ తో చేస్తున్న లియో అక్టోబర్ 19న విడుదలకు సిద్ధమవుతుండగా.. అజిత్ తో జోడీ కట్టనున్న విడాముయర్చి సెట్స్ పై ఉంది. అలాగే కమల్ హాసన్ తో మణిరత్నం తెరకెక్కించనున్న భారీ బడ్జెట్ మూవీలోనూ త్రిషనే నాయిక అని తమిళనాట కథనాలు వస్తున్నాయి. విజయ్, అజిత్, కమల్.. ఇలా ఈ ముగ్గురితోనూ త్రిష గతంలో సినిమాలు చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. త్రిష రేంజ్ ఏంటో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



