Home

»

Latest News

చిట్టి ఖాతాలో మ‌రో ఆఫ‌ర్!

Dec 8, 2021 10:06AM

ఈ ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ లో `జాతి ర‌త్నాలు` ఒక‌టి.  మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న విడుద‌లైన ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్టైన‌ర్ లో న‌వీన్ పోలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ టైటిల్ రోల్స్ లో సంద‌డి చేశారు. కాగా, ఇందులో న‌వీన్ కి జంట‌గా ఫ‌రియా అబ్దుల్లా క‌నిపించింది. చిట్టి పాత్ర‌లో త‌న‌దైన అభిన‌యంతో కుర్ర‌కారుని ఫిదా చేసింది ఫ‌రియా.

ఇదిలా ఉంటే.. `జాతి ర‌త్నాలు` సంచ‌ల‌న విజ‌యంతో ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించిన ఈ ముద్దుగుమ్మ‌.. సెలెక్టివ్ గానే సినిమాలు ఎంచుకుంటోంది. రీసెంట్ గా అక్కినేని అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` కోసం అతిథి త‌ర‌హా పాత్ర‌లో ఆక‌ట్టుకున్న ఫ‌రియా.. ప్ర‌స్తుతం కింగ్ నాగార్జున న‌టిస్తున్న `బంగార్రాజు`లో ఓ ప్ర‌త్యేక గీతంలో క‌నువిందు చేయ‌నుంద‌ని స‌మాచారం. అంతేకాదు.. తాజాగా మ‌రో ప్రాజెక్ట్ కి కూడా సంత‌కం చేసింది ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్. ఈ సారి పూర్తి స్థాయి క‌థానాయిక పాత్ర‌లోనే ఈ అమ్మ‌డు క‌నిపించ‌నుంది.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో సంతోష్ శోభ‌న్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమా రాబోతోంది. ఇందులో హీరోయిన్ గా ఫ‌రియా అబ్దుల్లా ఎంపికైంది. అంతేకాదు.. అభిన‌యానికి ఆస్కార‌మున్న పాత్ర‌లోనే ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని స‌మాచారం. మ‌రి.. ఈ చిత్రంతో ఫ‌రియా ఎలాంటి గుర్తింపుని, ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com