మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, నటి నజ్రియా నజీమ్ దంపతులకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 2014లో వివాహం చేసుకున్న ఈ జంట తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా బయటకు పంచుకోరు. అయితే తాజాగా ఫహాద్ ఫాజిల్ తన భార్య నజ్రియా గురించి చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఆయన నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.
సినిమాలో తన సహనటి సారా పాలేకర్ గురించి మాట్లాడుతున్న సమయంలో ఫహాద్‌కు నజ్రియా ప్రస్తావన వచ్చింది. పిల్లలను చూసుకోవడంలో తనకు చాలా ఓపిక ఉందని కొందరు అంటుంటారని, దానికి కారణం ఇంట్లోనే ఓ చిన్నపిల్ల లాంటి వ్యక్తి ఉండటమేనని ఫహాద్ సరదాగా చెప్పాడు. ‘‘నేను ఓ చిన్నపిల్ల లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. అందుకే పిల్లలను చూసుకోవడంలో నాకు ఓపిక ఎక్కువ’’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించాడు. భార్యను ఉద్దేశించి ఫహాద్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇదే సమయంలో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాలో తనతో కలిసి నటించిన సారా పాలేకర్‌ను కూడా ఫహాద్ ప్రశంసించాడు. షూటింగ్ సమయంలో ఆమె ఎంతో ఓపికగా వ్యవహరించిందని, తన డైలాగ్స్ విషయంలో కూడా సారా తనకు సహాయం చేసిందని చెప్పాడు. ఇప్పటివరకు తనతో కలిసి నటించిన వారిలో ఇంత ఓపిక ఉన్న సహనటి మరొకరు లేరని ఫహాద్ పేర్కొన్నాడు. దీంతో ప్రమోషన్ కార్యక్రమంలో ఫహాద్ చేసిన వ్యాఖ్యలు సరదాగా సాగాయి.
ఇక ఫహాద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ ‘బెంగళూరు డేస్’ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా.. 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి తమ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను చాలా అరుదుగా మాత్రమే బయటకు చెబుతున్న ఈ జంట, అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో చేసే సరదా వ్యాఖ్యలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఫహాద్ నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహించగా.. అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
[Fahadh Faasil, Nazriya Nazim, Fahadh Faasil Nazriya Marriage, Fahadh Faasil Comments, Fahadh Faasil Wife, Nazriya Nazim Husband, Dont Trouble The Trouble, Fahadh Faasil Latest News, Shashank Yeleti, Fahadh Faasil Telugu News]




