ENGLISH | TELUGU  

'F3' హిట్ కాకపోతే మళ్ళీ మీకు కనపడను!

on May 22, 2022

వెంకటేష్, వరుణ్ రేజ్ హీరోలుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన నవ్వుల చిత్రం 'F2'. 2019 జనవరిలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'F3' వస్తోంది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. " పాండెమిక్ టైంలో ఈ కథ స్టార్ట్ చేశాం. అన్ని వేవ్ లు, అడ్డంకులు దాటుకొని ఇప్పుడు ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది. మిమ్మల్ని బాగా నవ్వించాలన్న ఉద్దేశంతో చాలా కష్టపడ్డాం. ఎందుకంటే మా ముందు ఉన్న పెద్ద శత్రువు 'f2'. f2 ని మీరంతా బాగా ఎంజాయ్ చేశారు.. దాన్ని దాటి ఈ సినిమా ఇవ్వాలన్న ఉద్దేశంతో చాలా కష్టపడ్డాం. నవ్వడం చాలా ఈజీ.. కానీ కామెడీని క్రియేట్ చేయడం చాలా కష్టం. దానికోసం మా రైటింగ్ టీమ్ అంతా కలిసి చాలా కష్టపడి మంచి అవుట్ పుట్ తీసుకొచ్చాం. ఈ సినిమాకి ఆర్టిస్టులు అందరూ లైఫ్ పెట్టి పనిచేశారు. దేవిశ్రీప్రసాద్ గారు ఈ సినిమా చూసి.. ఇది కేవలం కామెడీ ఫిల్మ్ అనకండి.. మంచి కంటెంట్ ఉందంటూ కనెక్ట్ అయ్యి సోల్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. వరుణ్ తేజ్ నాకు బ్రదర్ లాగా. నత్తిని సినిమా అంతా క్యారీ చేస్తూ, డిఫరెంట్ వేరియేషన్స్ తో చాలా బాగా చేశాడు. వరుణ్ కి ఈ సినిమా ఆర్టిస్ట్ గా మంచి పేరు తీసుకొస్తుంది. వెంకటేష్ గారు ఆల్ టైం నా ఫేవరెట్ హీరో. ఆయన స్టార్ హీరో అయినప్పటికీ కామెడీ చేసేటప్పుడు ఆ ఇమేజ్ ని పక్కన పెట్టి చిన్నపిల్లాడిలా ఎంజాయ్ చేస్తూ నటిస్తారు. ఫం౩ లో f2 కి మించి పదింతలు నవ్విస్తారు" అన్నారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. " f3 లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వచ్చి చాలా రోజులైంది. ఫ్యామిలీ అంతా చూసి నవ్వుకునే సినిమా ఇది. ఈ సినిమాలో అందరూ అద్భుతంగా నటించారు. నాకు సునీల్ అన్న కామెడీ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో పాత సునీల్ ని చూస్తారు. దిల్ రాజు గారి బ్యానర్ లో 'ఫిదా', 'f2' చేశాను. ఇప్పుడు f3 తో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. అనిల్ రావిపూడి లాంటి పాజిటివ్ పర్సన్ ని నా లైఫ్ లో చూడలేదు. ఎప్పుడూ అందరిని నవ్విస్తూ ఉంటాడు. ఈ జనరేషన్ లో నాకు తెలిసి కామెడీ ఆయనకంటే బాగా ఎవరు చేయలేరు అనిపిస్తుంది. వెంకటేష్ గారు చాలా మల్టీస్టారర్స్ చేశారు. కానీ ఆయనతో రెండోసారి చేసే అదృష్టం నాకే దక్కింది. ఆయనతో నా ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను" అన్నారు.

వెంకటేష్ మాట్లాడుతూ.. " పాండెమిక్ కారణంగా దృశ్యం-2, నారప్ప సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. మూడేళ్లు తర్వాత నా సినిమా థియేటర్స్ లో విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. ఫ్యాన్స్ ఈ సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నన్ను ఎప్పుడూ ఆదరించే ఫ్యామిలీ ఆడియన్స్ f2 లాగే ఈ సినిమాని కూడా పెద్ద హిట్ చేస్తారని భావిస్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ థాంక్స్" అన్నారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. " తెలుగు సినిమా మూవీ మొఘల్ రామానాయుడు గారు ఉండేవారు. ఆయన తర్వాత నేను మనస్ఫూర్తిగా మూవీ మొఘల్ అని పిలవగలిగే నా సోదరుడు దిల్ రాజు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి 100 శాతం అవసరమైన సినిమా f3. ఒక మనిషి బ్రతుకులో నవ్వు ఎంత అవసరమో చెప్పే సినిమాల్లో ఇది ఒకటి. అందరికీ సమస్యలు ఉంటాయి.. ఆ సమస్యలు అన్నింటికీ పరిష్కారం నవ్వు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. దానికి కారణమైన వన్ అండ్ ఓన్లీ అనిల్ రావిపూడికి హ్యాట్సాఫ్. గుండె మీద చెయ్యి వేసుకొని చెబుతున్నాను.. ఈ సినిమా హిట్ కాకపోతే మళ్ళీ ముందు ఎప్పుడూ నిలబడను" అన్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.