వెంకటేశ్, వరుణ్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన 'ఎఫ్ 3'
on May 28, 2022
వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్ 3' మూవీ ఆ ఇద్దరి కెరీర్లలో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.35 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా రూ. 13.35 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 'ఎఫ్ 3' వరల్డ్‌వైడ్ ప్రి బిజినెస్ వాల్యూ రూ. 63.60 కోట్లు. అంటే తొలి రోజు సుమారు 21 శాతం రికవరీ అయ్యింది.
అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు తెలంగాణలో రూ. 4.06 కోట్లు, రాయలసీమలో రూ. 1.26 కోట్లు, ఆంధ్రాలో రూ. 5.03 కోట్ల షేర్ వచ్చింది. దిల్ రాజు సొంతంగా తెలంగాణలో రిలీజ్ చేశారు. ఈ ఏరియాలో మూవీ విలువ రూ. 18 కోట్లుగా ట్రేడ్ వర్గాలు లెక్క కట్టాయి. దాని ప్రకారం 22.5 శాతం రికవరీ అయ్యింది. ఆంధ్రా ఏరియాలో బిజినెస్ విలువ రూ. 27.40 కోట్లు. రికవరీ అయ్యింది 18 శాతం. రాయలసీమలో ప్రి బిజినెస్ విలువ రూ. 8.40 కోట్లు. అక్కడ అతి తక్కువగా 15 శాతం రికవరీ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రి బిజినెస్ విలువ రూ. 53.80 కోట్లు. తొలి రోజు రికవర్ అయ్యింది 19.2 శాతం.
ఓవరాల్‌గా చూస్తే.. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువగానే తొలి రోజు 'ఎఫ్ 3'కి కలెక్షన్లు వచ్చాయి. రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌తో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బాగా వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. టికెట్ రేట్లు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ చాలా చోట్ల కొన్ని షోలకు హౌస్‌ఫుల్ బోర్డులు పడలేదు.
Also Read