
'బేబి' జోడి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. '90s' వెబ్ సిరీస్‌తో అందరి మనసులను గెలుచుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటుండగా, తాజాగా మేకర్స్ ఒక మైండ్ బ్లోయింగ్ పోస్టర్‌తో మూవీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. 2026 సెప్టెంబర్ 11న ఈ సినిమా థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. పోస్టర్‌లో బీచ్ ఒడ్డున ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఒకేలాంటి డెనిమ్ డ్రెస్‌లు ధరించి, తమ పెంపుడు కుక్కతో సముద్రపు అలల మధ్య నడుస్తూ ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది.
'బేబి' సినిమాలో ఆనంద్, వైష్ణవి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను ఏ స్థాయిలో కట్టిపడేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 'ఎపిక్'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. సెప్టెంబర్ 11న విడుదలవుతున్న ఈ మూవీ, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Epic First Semester, Release Date, Anand Deverakonda, Vaishnavi Chaitanya, Aditya Hasan




