
యూత్, జెన్ జీ, మూవీ లవర్స్ అవైటెడ్ గా వెయిట్ చేస్తున్న మూవీ ENE రిపీట్. ఉరఫ్ ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 . 2018 లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కూడా కావడంతో ప్రేక్షకులు కూడా రీగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇదే అంటూ సోషల్ మీడియాలో సరికొత్త పులకింతలు రేపుతోంది.
మూవీ స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎంటర్ టైన్ మెంట్ గా సాగుతుందని, ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా కట్టుదిట్టమైన స్క్రీన్ ప్లే తో సీన్స్ వచ్చాయని ఫిలిం సర్కిల్స్ లో అంటున్నారు. సెన్సార్ బోర్డు UA' సర్టిఫికెట్ ఇవ్వడం శుభసూచికం. మూవీ చూసిన సెన్సార్ వాళ్ళు కూడా మూవీ బాగుందని చెప్పినట్టుగా సోషల్ మీడియా కథనం. నిడివి దాదాపు 2 గంటల 35 నిమిషాలు. మొదటి భాగంలో కార్తీక్ పాత్రలో కనిపించిన సాయి సుశాంత్ రెడ్డి స్థానంలో ఈసారి 'హిట్' ఫేమ్ శ్రీనాథ్ మాగంటి జాయిన్ అవ్వడం సినిమాకు ఒక కొత్త ఫ్రెష్‌నెస్‌ను తీసుకొచ్చిందని ప్రీ-రిలీజ్ టాక్ వినిపిస్తోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమానుల మధ్య ఉండే సహజమైన కామెడీ టైమింగ్, తెలంగాణ యాసలో సాగే పంచ్ డైలాగులు ఈసారి కూడా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, మొదటి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్‌లో తరుణ్ భాస్కర్ కేవలం వినోదానికే పరిమితం కాకుండా బలమైన ఎమోషనల్ డ్రామాను కూడా జోడించినట్లు ట్రైలర్ మరియు చిత్ర బృందం మాటల ద్వారా స్పష్టమవుతోంది. కొత్తగా ఈ గ్యాంగ్‌లో చేరిన శివాత్మిక రాజశేఖర్ పాత్ర కథలో కీలక మలుపు తిప్పనుండగా, అనీషా ఆంబ్రోస్ మరోసారి షెర్లీ పాత్రలో అలరించనుంది. అంతేకాకుండా, వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం మరియు పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే, ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 2,567 షోలకు గాను దాదాపు 1.95 లక్షల టికెట్లు అమ్ముడై 2.84 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే అత్యధికంగా 40 శాతం బుకింగ్స్ నమోదవ్వడం విశేషం. నెగటివ్ రివ్యూలు లేదా సోషల్ మీడియా ట్రోల్స్ గురించి తాను ఏమాత్రం ఆందోళన చెందడం లేదని, నిజాయితీతో కూడిన ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించామనే నమ్మకంతో తరుణ్ భాస్కర్ ఉన్నారు. మరి మొదటి భాగం సృష్టించిన కల్ట్ మ్యాజిక్‌ను 'ఈఎన్ఈ రిపీట్' మళ్ళీ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.




.webp)
