.webp)
భారతీయ సినీ ప్రేమికులు అనే పదం పుట్టుకకి ప్రధాన ఆద్యుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్. స్వయంగా యాక్టింగ్ నే అమితాబ్ కాళ్ళకి నమస్కరించి నేను ఇంత పవర్ ఫుల్ నా అంటుంది. మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళకి కూడా నటనలో అతి పెద్ద ఇన్ స్పిరేషన్. రీసెంట్ గా అమితాబ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
తాజాగా అమితాబ్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC) సీజన్ 18 షోలో పాల్గొన్న సందర్భంగా తన జీవితంలో జరిగిన ఒక భయానక సంఘటనను అభిమానులతో పంచుకున్నారు. గతంలో ఒక సినిమా షూటింగ్ నిమిత్తం నేపాల్ వెళ్లినప్పుడు తాను చావు అంచుల దాకా వెళ్లొచ్చినట్లు బిగ్ బి గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కయాకింగ్ చేసే క్రమంలో జరిగిన ఊహించని పరిణామాలు తనను మృత్యువు అంచుల వరకు తీసుకెళ్లాయని భావోద్వేగంతో వెల్లడించారు.
షూటింగ్ విరామ సమయంలో నేపాల్‌లోని ఒక అందమైన ప్రాంతంలో కయాకింగ్ చేయడానికి అక్కడున్న వారు సలహా ఇవ్వగా, మొదట ఆయన కొద్దిగా వెనుకాడినప్పటికీ ఆ సాహస క్రీడని ప్రయత్నించేందుకు అంగీకరించారు. అయితే ఆ సన్నని, పొడవాటి చిన్న కయాక్ పడవ ఎక్కడం ఎంత కష్టంతో కూడుకున్నదో ఆయన వివరిస్తూ, కేవలం ఆ బోటులోకి ప్రవేశించడానికి దాదాపు 45 నిమిషాల సమయం పట్టిందని తెలిపారు. సరిగ్గా పడవను నడుపుతున్న సమయంలో తప్పు దిశలో తిప్పడంతో ఒక్కసారిగా పడవ బోల్తా పడింది.
.webp)
పడవ బోల్తా పడినప్పుడు నీటి లోపల ఎలా ప్రవర్తించాలనే దానిపై తనకు ముందుగా కొన్ని సూచనలు అందాయని అమితాబ్ తెలిపారు. సాధారణంగా నీటి అడుగున రెండు చేట్లతో పైకి తోయాలని లేదా సహాయం కోసం నీటిలోనే చేతులు విదిలించాలని నిబంధనలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మనిషి ఎక్కువ సేపు ఊపిరి బిగపట్టుకోలేకపోవడంతో, ఆయన ప్రాణాలను కాపాడుకోవడానికి నీటి అడుగున తీవ్రంగా చేతులు ఊపుతూ బయటపడేందుకు ప్రయత్నించారు.
ఇది కూడా చదవండి:వైరల్ గా నిలిచిన అవెంచర్స్ డూమ్స్‌డే టికెట్ రేట్స్: మీరు కూడా ఈజీగా కొనేయవచ్చు!
అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ తనను కాపాడటానికి వెంటనే రాలేదని అమితాబ్ చమత్కారంగా, అదే సమయంలో ఆందోళనకరంగా చెప్పుకొచ్చారు. తాము ఒక సినిమా షూటింగ్లో ఉన్నామని, ఒకవేళ ఆ చిత్రంలోని ప్రధాన హీరోనే నీటిలో మునిగిపోతే పరిస్థితి ఏంటని, ఆ తర్వాత వేరే హీరోతో సినిమా కొనసాగించాల్సి వచ్చేదని ఆయన సరదాగా గుర్తుచేసుకున్నారు. చివరికి నీటి ప్రవాహం వద్ద, అనగా వాటర్‌ఫాల్ సమీపంలో నిలబడిన ఒక వ్యక్తికి ఏదో ప్రమాదం జరుగుతోందని గమనించి, ఎంతో కష్టపడి తనను బయటకు లాగారని తెలిపారు.
.webp)
ఆ ప్రత్యేకమైన ప్రదేశం నుండి ఒక మనిషిని సురక్షితంగా బయటకు తీయడానికి ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు అవసరమయ్యారని, తనను రక్షించడం కూడా చాలా కష్టతరమైందని అమితాబ్ బచ్చన్ వివరించారు. ఈ భయానక అనుభవాన్ని తలచుకుంటూ ఆయన చెప్పిన విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందుకే అంటారు సినిమా,ప్లస్ షూటింగ్ అనేవి మహా యజ్ఞం అని.
మీకు నచ్చవచ్చు:వైరల్ గా సాయి పల్లవి!
మీకు నచ్చవచ్చు:భోగి కొత్త రిలీజ్ డేట్ ఇదే: ఫ్యాన్స్ లో పూనకాలు!
[Amitabh Bachchan ,Nepal kayaking, Bollywood news, Chiranjeevi]





