
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న 7 PM ప్రొడక్షన్స్ సంస్థ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇ.ఎం.ఐ టైటిల్ తో న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఓ కంప్లీట్ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి నిఖిల్ కువ్వరపు దర్శకత్వం వహిస్తున్నారు. లాల్ సలామ్, హాస్టల్ డేస్ వంటి పలు వెబ్ సిరీస్ లతో పేరు తెచ్చుకున్న దరహాస్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. లిటిల్ హార్ట్స్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించి ఫేమ్ అయిన శైలజ ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.
ఈ రోజు పూజా కార్యక్రమాలతో "ఇ.ఎం.ఐ" సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో ఆది సాయికుమార్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందజేశారు.

బైక్, కారు, మంచి ఫోన్..ఇలా ఏ వస్తువు కొన్నా ఇ.ఎం.ఐ కట్టాల్సిందే. దాదాపు ప్రతి మధ్య తరగతి ఇంటిలో ఇ.ఎం.ఐ కష్టాలు తప్పవని అనుకోవచ్చు. ఇలా ఇ.ఎం.ఐ మీద వస్తువులు తీసుకున్న యువత ఆ ఇ.ఎం.ఐ లు కట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే కాన్సెప్ట్ తో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో పాటు కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలోని ప్రతి సీన్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండబోతోంది.
ఇక ఈ సినిమాతో పాటు 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
[EMI Movie Launch, The Great Pre Wedding Show, Telugu Comedy, 7 PM Productions, Aadi Saikumar, Telugu Film News, Telugu News]




