Home

»

Latest News

మరదలిపై దాడి చేసిన సీనియర్ యాక్టర్..

Oct 3, 2016 4:06PM

ఎందరో ఆడపిల్లల జీవితం నాశనం చేసి వారి ఉసురు తీసిన వరకట్న రక్కసికి సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అతీతులు కాదని ఎన్నోసార్లు రుజువైంది. సెలబ్రిటీలు డబ్బు కోసం సొంత కుటుంబసభ్యులపైనే దాడి చేసిన ఘటనలు మనకు తెలుసు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ పై ఇదే తరహా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనను కట్నం కోసం వేధించడమే కాకుండా భౌతిక దాడికి సైతం దిగాడంటూ నవాజుద్దీన్ తమ్ముడి భార్య గత నెల 28న అతనిపై కేసు నమోదు చేసింది. దీనిపై మీడియా ఆయనను ప్రశ్నించగా..ఆమె నాపై కావాలనే ఇలా కేసు నమోదు చేసిందని, కట్నం కోసం నా తమ్ముడి భార్యను నేనేందుకు వేధిస్తాను నాకేం అవసరం అని అన్నాడు. నేను నటుడిని కావడం వల్లనే నాపై ఇలా కేసు నమోదు చేస్తే టీవీ, మీడియాలలో పాపులర్ కావొచ్చనే ఆమె అలా చేసిందని చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 28న తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని కదలడానికి ఓపిక లేని నేను ఆమెను ఎలా కొడతానని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు నిజాలను న్యాయస్థానం తెలుస్తుందని చెప్పాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com