Home

»

Latest News

నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాసు మూవీ

Mar 16, 2011 1:01PM

nandamuri balakrishna stills, nandamuri balakrishna images, nandamuri balakrishna pics, nandamuri balakrishna photos, nandamuri balakrishna pictures, nandamuri balakrishna wallpapersనందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాసు దర్శకత్వంలో ఒక మూవీ తయారవుతోందని విశ్వసనియ వర్గాల ద్వారా అందిన సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన "సింహా" వంటి బ్లాక్ బస్టర్ వంటి హిట్టిచ్చిన తర్వాత, దాసరి నారాయణరావు దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా "పరమవీరచక్ర" చిత్రంలో నటించారు.

 

ఇది నందమూరి బాలకృష్ణ ఇమేజ్ ని బాగా దెబ్బతీసింది. అలాగే నందమూరి బాలకృష్ణ అభిమానులను కూడా బాగా నిరాశపరిచింది. ఈ సినిమాలో నటించటం వల్ల నందమూరి బాలకృష్ణ సరైన నిర్ణయాలు తీసుకోకుండా, మొహవాటాలకు పోయి దాసరి వంటి వారి దర్శకత్వంలో నటించి ఫ్లాపులిస్తున్నారనీ, అందుకని నందమూరి బాలకృష్ణ యంగ్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేయాలని నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆశిస్తున్నారు. శ్రీవాసు గతంలో గోపీచంద్ హీరోగా "లక్ష్యం" చిత్రానికీ, రామ్ హీరోగా "రామ రామ కృష్ణ కృష్ణ" చిత్రానికి దర్శకత్వం వహించగా, మొదటి చిత్రం సూపర్ హిట్టయితే రెండవ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

 

అలాంటి శ్రీవాసు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఒక సినిమాలో నటించటానికి అంగీకరించారట. నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాసు దర్శకత్వంలో రాబోయే ఈ మూవీ ప్రస్తుతం కథా చర్చల్లో ఉంది. ఈ మూవీకి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com