Home

»

Latest News

"బద్రీనాథ్" షూటింగ్ లో అల్లు అర్జున్

Mar 16, 2011 2:19PM

allu arjun stills, allu arjun images, allu arjun pics, allu arjun photos, allu arjun pictures, allu arjun wall papers"బద్రీనాథ్" షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొంటున్నాడని సమాచారం. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, అల్లు అర్జున్ హీరోగా, మిల్కీ వైట్ భామ తమన్నా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్డక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం"బద్రీనాథ్".

 

ఈ "బద్రీనాథ్" చిత్రానికి ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ అద్భుతమైన కథనందించారట.ఈ "బద్రీనాథ్" చిత్రంలోని రెండు పాటల్లో హీరో అల్లు అర్జున్ డ్యాన్స్ అమోఘమైన డ్యాన్స్ చేశారట. అంతేకాక ఈ చిత్రంలో రామ్ చరణ్ "మగధీర" చిత్రంలో చంపినట్లు అల్లు అర్జున్ కూడా వందమందిని చంపుతాడట. ఇవన్నీ పక్కన పెడితే ఈ "బద్రీనాథ్" చిత్రంలో అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ లా కత్తితో పోరాడతాడని తెలిసింది.

 

ఇన్ని ప్రత్యేకతలున్న ఈ "బద్రీనాథ్" చిత్రం షూటింగ్ మార్చ్ 21 వ తేదీ నుండి తిరిగి ప్రారంభం కానుంది. ఈ స్కెడ్యూల్లో ప్యాచ్ వర్కంతా పూర్తి చేస్తారు. ఈ "బద్రీనాథ్" సినిమా ఒక సోషియో ఫాంటసీ కథతో నిర్మిస్తున్నారట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com