Home

»

Latest News

'హీరో'తోనైనా సాలిడ్ హిట్ కొడ‌తాడా!

Jan 15, 2022 4:37PM

 

విభిన్న ప్ర‌య‌త్నాల‌తో ముందుకు సాగుతున్న యువ ద‌ర్శ‌కుల్లో శ్రీ‌రామ్ ఆదిత్య ఒక‌రు. 2015 క్రిస్మ‌స్ స్పెష‌ల్ గా విడుద‌లైన `భ‌లే మంచి రోజు`(సుధీర్ బాబు క‌థానాయ‌కుడు)తో ద‌ర్శ‌కుడైన శ్రీ‌రామ్.. ఆపై `శ‌మంత‌క‌మ‌ణి` (2017), `దేవ‌దాస్` (2018) చిత్రాల‌తో ప‌ల‌క‌రించాడు. అయితే, వీటిలో ఓ ఒక్క‌టీ కూడా హిట్ స్టేట‌స్ కి చేరుకోలేక‌పోయింది. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిష‌న్, ఆది సాయికుమార్ కాంబినేష‌న్ లో రూపొందిన‌ `శ‌మంత‌క‌మ‌ణి` ఫ‌ర్లేద‌నిపించ‌గా.. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన నాగార్జున‌, నాని మ‌ల్టిస్టార‌ర్ `దేవ‌దాస్` ఆశించిన ఫ‌లితం అందివ్వ‌లేక‌పోయింది.

Also read: ​జ‌న‌వ‌రి 15.. మ‌హేశ్ లాగే అశోక్‌కీ ప్ల‌స్స‌వుతుందా!

ఈ నేప‌థ్యంలో.. స్వ‌ల్ప విరామం అనంత‌రం `హీరో` చిత్రంతో ఎంట‌ర్టైన్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు శ్రీ‌రామ్ ఆదిత్య‌. కృష్ణ మ‌న‌వ‌డు, మ‌హేశ్ బాబు మేన‌ల్లుడు అయిన గ‌ల్లా అశోక్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ శ్రీ‌రామ్ ఆదిత్య రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా ఈరోజు (జ‌న‌వ‌రి 15) థియేట‌ర్స్ లోకి వ‌చ్చింది. త‌న కెరీర్ లో తొలి పొంగ‌ల్ స్పెష‌ల్ మూవీగా వ‌చ్చిన ఈ చిత్రంతోనైనా శ్రీ‌రామ్ ఆదిత్య సాలిడ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

కాగా, నిధి అగర్వాల్ క‌థానాయిక‌గా న‌టించిన `హీరో`లో జ‌గ‌ప‌తిబాబు, న‌రేశ్ ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు. జిబ్రాన్ ఈ సినిమాకి స్వ‌ర‌క‌ర్త‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com