.webp)
ప్రపంచ శాంతి కోసం థాయ్‌లాండ్ కి చెందిన 60 మంది బౌద్ధ బిక్షువులు(మాంక్స్) ఈ నెల 22 నుంచి కర్ణాటక రాష్ట్రం స్వర్ణభూమి నుండి తెలంగాణ రాష్ట్రం నాగార్జున సాగర్ బుద్ధభూమి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ నుంచి తుర్కయాంజిల్ వరకు 17 కిలోమీటర్ల పాదయాత్రలో కింగ్ బుద్ద హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి(Satya Reddy)మరియు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రపంచ శాంతి కోసం కింగ్ బుద్ధ(king buddha)చిత్రాన్ని హాలీవుడ్ లో నిర్మిస్తున్న డైరెక్టర్ సత్యారెడ్డి మెడలో గౌతమ బుద్ధుడి లాకెట్ ని ధరింపజేసి సీనియర్ మాంక్స్ కింగ్ బుద్ధ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించాలని ఆశీర్వదించారు. ఈ సందర్బంగా సత్యారెడ్డి మాట్లాడుతూ... "అమెరికాలో ప్రారంభించిన “కింగ్ బుద్ద (We Want World Peace)" హాలీవుడ్ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నాం. ఇప్పటివరకు 10 దేశాల్లో షూటింగ్ పూర్తయ్యింది. ఇంకా 15 బౌద్ధ దేశాల్లో చిత్రీకరణ జరపాల్సి ఉంది. ఈ చిత్రంలో హాలీవుడ్, బాలీవుడ్, సౌత్ ఇండియా ప్రముఖ యాక్టర్స్ చేస్తున్నారు. ప్రపంచంలోని 100కి పైగా భాషల్లో విడుదల చేయాలనే లక్ష్యం.
నా 'ఉక్కు సత్యాగ్రహం' శతదినోత్సవ చిత్రంలో విప్లవకవి గద్దర్ గారు నాకు బౌద్ధిజం నేర్పించారు. అందుకే ఆ మూవీలో బుద్ధుని సీన్లు కొన్నిటిని చూపించాం. ఇప్పుడు పూర్తిస్థాయిలో గౌతమ బుద్ధునిపై “కింగ్ బుద్ధ” చిత్రాన్ని నిర్మించడం ఒక గొప్ప ఛాలెంజ్‌గా భావిస్తున్నాను. థాయిలాండ్, మలేషియాలలో టీజర్, ట్రైలర్ లాంచ్, ఢిల్లీ,అమరావతిలలో ప్రీరిలీజ్ ఈవెంట్స్ చేస్తాం. పాదయాత్ర ముగింపు వరకు "కింగ్ బుద్ద" చిత్ర యూనిట్ పాల్గొంటుంది ప్రపంచ శాంతి కోసం స్వర్ణభూమి నుంచి బుద్ధభూమి వరకు జరిగే ఈ పాదయాత్రలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరపాలి. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ఒక డైరెక్టర్‌గా ఎదగడం నాకు గర్వకారణం. “కింగ్ బుద్ధ" మూవీ ప్రపంచ శాంతి సందేశంతో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి హాలీవుడ్ ప్రాజెక్ట్. బుద్ధుని జీవితం,పంచశీల సిద్ధాంతాలు లక్ష్యంగా కింగ్ బుద్ధ రూపొందుతుందని సత్య రెడ్డి చెప్పకొచ్చాడు.
.webp)








