
హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై ఈరోజు తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘గుమ్మడి నర్సయ్య’ బయోపిక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు పరమేశ్వర్ ప్రయాణిస్తున్న కారు ప్రయాణంలో ఊహించని విధంగా ప్రమాదానికి గురైంది. జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం ఘోరంగా దెబ్బతిన్నప్పటికీ, దర్శకుడు పరమేశ్వర్ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాద తీవ్రతను చూస్తే కారు ముందు భాగం, బోనెట్ మరియు గ్రిల్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. కారు బాగా డ్యామేజ్ కావడం చూస్తుంటే ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందో అర్థమవుతోంది. అయితే అదృష్టవశాత్తూ దర్శకుడు పరమేశ్వర్ క్షేమంగా బయటపడ్డారు.
తెలంగాణ ప్రజా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న 'గుమ్మడి నర్సయ్య' సినిమాపై సినీ ప్రియుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. 'గుమ్మడి నర్సయ్య' పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటిస్తుండటం విశేషం.

Gummadi Narsaiah, Director Parameshwar, Car Accident, Hyderabad ORR






