
భారతీయ చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమాకి, తెలుగు సినిమా ప్రేక్షకులకి ఉన్న ప్రత్యేకత వేరు. తమకి నచ్చాలే కానీ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అన్ని భాషల సినీ తారల్ని గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. ఈ కోవలోనే తన అద్భుతమైన పెర్ఫార్మ్ , సమ్మోహన పరిచే గ్లామర్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ భామ రవీనా టాండన్. నేటికి రవీనా తెలుగు సాంగ్స్ ని యూట్యూబ్ లో వింటూ ఉండేవాళ్ళు కోకొల్లలు.
ఇప్పుడు రవీనా కుమార్తె, నట వారసురాలు రషా థడానీ 'శ్రీనివాసమంగాపురం' ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతోంది. 'మంగ' అనే క్యారక్టర్ లో సదరు క్యారక్టర్ ప్రకారం జీవకళ ఉట్టిపడే స్వచ్ఛమైన తెలుగు అమ్మాయిగా కనిపిస్తోంది. దర్శకుడు అజయ్ భూపతి కథ చెప్పినప్పుడే హీరో, హీరోయిన్ పాత్రల రెంటికీ సమాన ప్రాధాన్యత ఉందనే విషయాన్ని స్పష్టం చేశారని రాషా ఇంటర్వ్యూలలో వెల్లడించింది. తెలుగు భాష కొత్త అయినప్పటికీ, కథలోని భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకుని స్వయంగా డైలాగులు చెప్పడానికి ఎంతో శ్రమించింది. షూటింగ్ సమయంలో తిరుపతి ప్రాంతంలో నెలల తరబడి గడిపిన రాషా, అక్కడి వాతావరణానికి, సంస్కృతికి బాగా దగ్గరైంది. సోషల్ మీడియాలో ఇప్పటికే 1 మిలియన్ (10 లక్షలు) పైగా ఫాలోవర్లతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ, తన మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. తల్లి రవీనా టాండన్ ఇచ్చిన సలహాలు, సూచనలు తనకు షూటింగ్‌లో ఎంతగానో ఉపయోగపడ్డాయని, టాలీవుడ్ పరిశ్రమ ఇచ్చే గౌరవం, ఇక్కడి కథల వైవిధ్యం తనకు ఎంతో నచ్చాయని వెల్లడి చేసిన రాషా ఏ మేరకు తెలుగు ప్రేక్షకులని తన చెప్పు చేతల్లో ఉంచుకుంటుందో చూడాలి.
Also read: సరికొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన అందాల నటి.. ఓకూ అంటే ఏమిటో తెలుసా!
జులై 30న విడుదల కానున్న శ్రీనివాస మంగాపురం సూపర్‌స్టార్ మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేనికి కూడా హీరోగా మొదటి చిత్రం .చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తుండగా, ప్రముఖ వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ సమర్పిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీ రోల్ లో కనిపిస్తున్నాడు.






