
మాస్ మహారాజ రవితేజ(Raviteja)ప్రస్తుతం ఇరుముడి(irumudi)తో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 21 న విడుదలవుతుండగా ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత రవితేజ సరిపోదా ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు.
ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్‌గా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ జోడీ నుంచి రాబోతున్న హ్యాట్రిక్ చిత్రం ఇదే అవుతుంది. గతంలో రవితేజ, డింపుల్ హయతి కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'ఖిలాడి' (2022) చిత్రంలో వీరు మొదటిసారి కలిసి నటించారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాలో డింపుల్ తన గ్లామర్‌తో, నటనతో మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ఇటీవల 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రంలో ఈ జోడీ మళ్లీ అలరించింది. ఈ కామెడీ డ్రామా చిత్రంలో డింపుల్ పోషించిన 'బాలామణి' పాత్ర, అలాగే మాస్ మహారాజాతో కలిసి ఆమె వేసిన స్టెప్పులు, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో భారీ విజయాలు సాధించకపోయినా, ఈ జోడీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం సూపర్ హిట్ అనిపించుకుంది.
ఈ సరికొత్త ప్రాజెక్ట్ డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ జోనర్‌లో ఉండబోతోందని సమాచారం. విభిన్నమైన కథాంశాలతో, స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో మెప్పించే వివేక్ ఆత్రేయ.. మాస్ మహారాజా కోసం ఒక పవర్‌ఫుల్ స్టోరీని సిద్ధం చేశారట. ఈ కథలో హీరోయిన్ పాత్రకు గ్లామర్‌తో పాటు నటనకు చాలా ప్రాధాన్యత ఉండటంతో, రవితేజ సరసన పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే డింపుల్ హయతినే ఫైనల్ చేసినట్లు టాక్. ప్రస్తుతం ఈ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
.webp)






