
టాలీవుడ్‌లో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు, స్వచ్ఛమైన ప్రేమకథలతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. 'కలర్ ఫోటో', 'బేబి' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన మాస్ మూవీ మేకర్స్, అమృతా ప్రొడక్షన్స్ బ్యానర్ల నుండి వస్తున్న తాజా లవ్ స్టోరీ కావడంతో 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ క్రేజీ మూవీ తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'U/A' సర్టిఫికేట్‌ను కేటాయించింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు అవుట్‌పుట్ పట్ల ఎంతో సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. యూత్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను సైతం మెప్పించే అందమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. స్వచ్ఛమైన ప్రేమ, నేటి తరం ఆలోచనలు, భావోద్వేగాల కలబోతగా ఈ చిత్రం ఉండబోతోందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో రవి నంబూరి సరికొత్త ప్రేమకావ్యాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ ఈ చిత్రానికి మరో నిర్మాతగా వ్యవహరిస్తుండటం సినిమాపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతోంది.

ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ఆయన అందించిన స్వరాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ప్రేమకథను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర యూనిట్ ఎంతో ధీమాగా వ్యక్తం చేస్తోంది.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, పాటలు నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నాయి. జూలై 24న విడుదల కాబోతున్న ఈ 'చెన్నై లవ్ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Chennai Love Story, Censor Talk, Kiran Abbavaram, Sri Gouri Priya






